Begin typing your search above and press return to search.
‘‘శ్రీశైలం’’ లో నీళ్లు ఎంతలా తగ్గుతున్నాయంటే..?
By: Tupaki Desk | 18 April 2016 4:37 AM GMTతెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకోవటం.. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోవటం తెలిసిందే. ఈ వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవు రక్కసి తెలుగు ప్రజల్ని తీవ్రంగా వెంటాడుతోంది. రోజురోజుకీ అడుగంటుతున్న భూగర్భ జలాలు ఒకపక్క.. మరోపక్క జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకీ అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితి ఎంతలా ఉందంటే.. గడిచిన 15 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలం ఆనకట్ట పాతాళగంగ సమీపంలో నీటి నిల్వలు భారీగా పడిపోయి.. ప్రాచీన మండపం బయట పడింది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఇలాంటి మండపాల్ని తరలించినా.. మరికొన్ని చిన్న మండపాల్ని మాత్రం వదిలేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏళ్లకు ఏళ్లు నీళ్లలోనే మునిగిపోయి ఉన్నప్పటికీ.. మండపాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా నీటి మట్టం తగ్గటంతో ప్రాచీన మండపం పై కప్పు భాగం దర్శనమిస్తోంది. ఇన్నేసి ఏళ్లు నీళ్లలో ఉన్నా.. మండపం మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మరింత నీటి మట్టం తగ్గితే.. ఈ మండపం మరింత బయటకు వచ్చే అవకాశం ఉంది.