Begin typing your search above and press return to search.

మార్స్​ అంతర్భాగంలో నీటి ఊటలు..!

By:  Tupaki Desk   |   21 March 2021 4:03 AM GMT
మార్స్​ అంతర్భాగంలో నీటి ఊటలు..!
X
అంగారక గ్రహం ( మార్స్​) అంతర్భాగంలో నీటి ఊట ఉందని తాజాగా నాసా పరిశోధనలో వెల్లడైంది. అంగారకుడిపై గతంలో సరస్సులు, నదులు, సముద్రాలు కూడా ఉండేవని ఈ పరిశోధన తేల్చింది.

అంగారక గ్రహం లోపల అనేక విలువైన ఖనిజ సంపద ఉందని కూడా నాసా పరిశోధనలో వెల్లడైంది. నాసాపై జీవరాశి మనుగడకు అవకాశం ఉందా? అనే విషయంపై కూడా అనేక ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పరిశోధనలు ఇప్పుడిప్పుడే పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మార్స్​ పై నాసా కొన్ని సరికొత్త విషయాలను కనిపెట్టింది. నాసా అంతర్భాగంలో నీటి ఊట ఉన్నట్టు తాజాగా నాసా పరిశోధనలో తేలింది.

అంగారక గ్రహం అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్టు నాసా పరిశోధనలో తేలింది. అంతేకాక అంగారక గ్రహంపై అనేక నీటి కొలనులు, సరస్సులు కూడా ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. కానీ అవి ఇప్పుడు లేవు. బిలియన్​ ఏళ్ల క్రితం ఉండేవి. అయితే ఆ నీరు ఇప్పుడు ఎక్కడికి పోయింది అనే విషయంపై నాసా విస్తృత పరిశోధనలు చేస్తున్నది.

నాసా ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. మార్స్ పై ఉన్న నీరు 30 నుంచి 99 శాతం వరకు గ్రహం అంతర్భాగంలోని ఖనిజాలలో ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

ఈ మేరకు కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) సంయుక్తంగా కొన్ని పరిశోధనలు సాగించాయి. బిలియన్​ ఏళ్ల క్రితం ఇక్కడ నీరు ఉండేదని అయితే ప్రస్తుతం
సముద్రరూపంలో నీరు, గ్రహం మొత్తాన్ని నీటితో కప్పివేసిందనే విషయాన్ని కనుగొన్నారు.

బిలియన్ ఏళ్ల తరువాత, మార్స్‌ పై ప్రస్తుతం ఉన్న శుష్కనేలలతో పొడిగా ఉండే వాతావరణం ఏర్పడి ఉండొచ్చని తెలిపారు. అంగారక గ్రహంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ నీరంతా అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉంటుందని పరిశోధకలు అంటున్నారు. అంగారక గ్రహం అనేది ఓ అంతుచిక్కని రహస్యం అక్కడ అనేక విషయాలపై ఇప్పటికే పరిశోధనలు సాగుతూనే ఉంటాయి. తాజాగా ఈ షాకింగ్​ నిజం వెలుగు చూసింది.