Begin typing your search above and press return to search.

ఎత్తిపోతలపై బాబు వ్యూహాత్మక మౌనాన్ని గమనించారా?

By:  Tupaki Desk   |   15 May 2020 4:30 AM GMT
ఎత్తిపోతలపై బాబు వ్యూహాత్మక మౌనాన్ని గమనించారా?
X
అవసరం ఉన్నా లేకున్నా అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి.. తన సందేశాన్ని మీడియాలో చూసుకొని మురిసిపోయే అలవాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎక్కువన్న విమర్శ పలువురి నోటి నుంచి వస్తుంటుంది. అవసరమైన దానికి మించి ఆయన మాట్లాడుతుంటారని.. ఆ అలవాటును ఆయన ఎంత త్వరగా మార్చుకుంటే.. అంత మంచిదన్న సూచన వినిపిస్తుంటుంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా డైలీ బేసిస్ లో మీడియాతో మాట్లాడే అలవాటున్న బాబు.. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఏపీలోని జగన్ సర్కారు కొత్త ఎత్తిపోతల పథకాన్ని తెర మీదకు తీసుకురావటం.. దానిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా.. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఎం జగన్ కు తెలంగాణ చాలానే ఇచ్చిందని.. అలాంటి రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బేసేలా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాల్ని వినియోగించేందుకు నిర్దేశించిన ఎత్తిపోతల పథకంపై రెండు తెలుగు రాష్ట్రాలు.. రాజకీయ నేతలు అదే పనిగా వాదనను వినిపిస్తున్నారు. ఇంతటి కీలకమైన వేళ.. ఈ అంశం మీద తన వాదనను వినిపించాల్సిన ఏపీ విపక్ష నేత చంద్రబాబు మౌనంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. తరచూ ఏదో ఒక అంశం మీద మాట్లాడే ఆయన.. తాజా ఎత్తిపోతల పథకంపై మౌనం.. వ్యూహాత్మకంగా చెబుతున్నారు.

ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారో చూడాలని.. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలని డిసడై్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎత్తిపోతల పథకం పై తన స్టాండ్ ఏమిటన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టం చేసింది లేదు. తానేం మాట్లాడినా.. దానికి ఏదో ఒక రంగు పూసి ఇబ్బంది పెట్టే అనుభవాలెన్నో. తద్వారా రాజకీయ లబ్థిని పొందే రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదన్న యోచనతోనే ఎత్తిపోతల అంశం మీద ఎక్కువగా మాట్లాడటం లేదన్న మాట వినిపిస్తోంది.అయితే.. అదే పనిగా మాట్లాడటం.. లేదంటే మౌనంగా ఉండటం మంచిది కాదన్నది బాబుకు ఎప్పుడు భోదపడుతుందో?