Begin typing your search above and press return to search.
ఎత్తిపోతలతో తెలంగాణ కు నష్టం లేదు.. ఏపీ వాదన ఇదే
By: Tupaki Desk | 19 May 2020 5:45 AM GMTగడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే కాదు.. రాజకీయ నేతల మధ్య హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తమదైన వాదనను వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలకు కించిత్ భంగం వాటిల్లినా ఊరుకోమని తెలంగాణ రాష్ట్ర సీఎం తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. ఇలాంటి వేళ.. ఏపీ సర్కారు తాము చేపట్టిన ప్రాజెక్టు మీద వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తాజాగా ఈ ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కారు తన వాదనను వినిపించింది. తాము చేపట్టే ఎత్తిపోతల పథకం కారణంగా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని చెప్పింది. శ్రీశైలం రిజర్వాయర్ లో దిగువస్థాయి నుంచి నీటిని తీసుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు ఉండటంతో పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ కు నీరు అందటం కష్టంగా మారిందని పేర్కొంది. అందుకే కొత్త లిప్టును ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ట్రైబ్యులన్ కోటా మేరకు నీటి వాడకంలో భాగంగానే ఈ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రాజెక్టులతో పాటు.. కల్వకుర్తి.. నెట్టెంపాడు.. ఎస్ఎల్ బీసీ వంటి ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు ద్వారా నీటి వినియోగం 77 టీఎంసీల నుంచి 105 టీఎంసీలకు.. ఆయుకట్టు 7.20లక్షల ఎకరాల నుంచి 9.93 లక్షల ఎకరాలకు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగుల వద్ద ఉన్నా.. పంపింగ్ చేయగలిగే ఇలాంటి ప్రాజెక్టులతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీరందే పరిస్థితి లేదన్నారు. దీని కారణంగా రాయలసీమతోపాటు ఇతర జిల్లాల మీద ప్రభావం పడుతుందని పేర్కొంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇటీవల చేపట్టిన పాలమూరు.. డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న విషయాన్ని ప్రస్తావించి.. వాటి సంగతేమిటని ప్రశ్నించింది. పునర్విభజన చట్టం ప్రకారం బోర్డులు.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. సమగ్ర ప్రాజెక్టునివేదిక అందించకుండానే తెలంగాణ పలు ప్రాజెక్టుల్ని చేపట్టిన విషయాన్ని గుర్తి చేశారు. పాలమూరు.. డిండి.. భక్త రామదాసు.. తుమ్మిళ్లతో పాటు గోదావరి బేసిన్ లోని కాళేశ్వరం.. దేవాదుల 3.. సీతారామ.. తుపాకులగూడెం.. రాజుపేట.. చనాఖా.. పింపార్డ్ లాంటి చెరువు మళ్లింపు ప్రాజెక్టుల సంగతేమిటి? అని ప్రశ్నించింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 150 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులను చేపట్టారని.. అవన్నీ ట్రైబ్యునల్ తీర్పులకు విరుద్ధమని పేర్కన్నారు. మొత్తంగా తాము చేపట్టే ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పలు ప్రాజెక్టుల అసలురూపం బయట పెట్టేలా ఏపీ వాదన ఉండటం గమనార్హం. మరి.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.