Begin typing your search above and press return to search.

సీఎం బోణీతో ఆ షోరూం సుడి తిరిగింది

By:  Tupaki Desk   |   22 Jan 2016 7:38 AM GMT
సీఎం బోణీతో ఆ షోరూం సుడి తిరిగింది
X
ప్రముఖులు పలు షాపులు.. షోరూంల ఓపెనింగ్స్ కు వెళ్లటం మామూలే. అలా తాము ఓపెన్ చేసిన షాపుల్లో షాపింగ్ చేయటం లాంటివి పెద్దగా చేయరు. ఇక.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఓపెనింగ్ కు వెళ్లి షాపింగ్ చేయటం చాలా.. చాలా అరుదు. అలాంటి పనే ఒకటి చేసి ఈ మధ్య కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వార్తల్లోకి వచ్చారు. దావణగెరెలో ఒక షోరూం ఓపెన్ చేసిన ఆయన.. రూ.లక్షకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసి చీరను కొనుగోలు చేశారు. సీఎం లాంటి వ్యక్తి స్వయంగా షాపింగ్ చేయటం.. రూ.లక్షకు పైనా విలువైన చీరను కొనుగోలు చేయటంతో సదరు చీర మీద ఒక్కసారి ఆసక్తి వ్యక్తమైంది. ఏమా చీర? దాని ప్రత్యేకత ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ఆసక్తికి తగ్గట్లే సీఎం కొనుగోలు చేసిన చీరకు ఓ స్పెషాలిటీ ఉంది. సదరు చీర వాటర్ ఫ్రూప్ అట. దాని నాణ్యతను స్వయంగా చూసిన ఆయన ముచ్చటపడి దాన్ని కొనుగోలు చేశారు. భార్యకు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలు మీడియాలో ప్రముఖంగా రావటంతో సదరు షోరూం సుడి తిరిగిపోయింది. ముఖ్యమంత్రి మనసు దోచుకున్న చీర లాంటివే తమకూ కావాలంట పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో.. షోరూంలో అమ్మకాలు పెరిగిపోయాయి. సీఎం షాపింగ్ ఏమో కానీ.. సదరు షోరూం సుడి ఓ రేంజ్ లో తిరిగిపోయిందని చెబుతున్నారు.