Begin typing your search above and press return to search.
ఆర్ ఎస్ ఎస్ ఆ తప్పు చేయట్లేదట
By: Tupaki Desk | 1 July 2016 7:37 AM GMTరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన వివాదాస్పద నిర్ణయం నుంచి వెనక్కు తగ్గింది. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఆర్ ఎస్ ఎస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ మిత్రపక్షమైన శివసేన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ద్వారా ఆరెస్సెస్ ముస్లింలను బుజ్జగించే పనిలో పడినట్లు ఉందని శివసేన పేర్కొంది. అయితే దీనిపై సంఘ్ క్లారిటీ ఇచ్చింది
తాము ఎటువంటి ఇప్తార్ విందుకూ ఆతిథ్యం ఇవ్వడం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పష్టం చేసింది. ఆర్ ఎస్ ఎస్ ఇఫ్తార్ విందుకు ఆతిధ్యం ఇస్తున్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆర్ ఎస్ ఎస్ ప్రచార ప్రముఖ్ మన్మోహన్ విద్య తెలిపారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎమ్ ఆర్ ఎం) అనేది స్వతంత్ర సంస్థ అనీ, మత సామరస్యంపై జాతీయ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు మతరాజకీయాలు అంటూ విమర్శించిన ఆర్ ఎస్ ఎస్ ఇప్పుడు తాను స్వయంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని శివసేన దుయ్యబట్టింది. తన అడుగులు ఎటువైపుగా పడుతున్నాయో ఆర్ ఎస్ ఎస్ అర్థం చేసుకోవాలని అన్నారు. అన్నివైపులా విమర్శలు వచ్చిన నేపథ్యంలో సంఘ్ ఈ క్లారిటీ ఇచ్చింది.