Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌లోనే.. కాంగ్రెస్‌తోనే.. కొండా కపుల్ స్పష్టం
By: Tupaki Desk | 27 March 2022 10:31 AM GMTపార్టీ మారుతున్నారు.. కాంగ్రెస్ గూటి నుంచి కమలం గూటికి చేరుతున్నారు.. అంటూ.. వస్తున్న వార్తలపై.. కొండా సురేఖ మురళి దంపతులు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లోనే ఉంటామని, కాంగ్రెస్‌తోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. గత కొన్నాళ్లుగా.. కొండా దంపతులు.. పార్టీ మారుతున్నారని.. ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు.. వెబ్ సైట్లలోనూ.. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నా.. ప్రాధాన్యం లేకుండా పోయిందని.. ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కుటుంబం క్లారిటీ ఇచ్చింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబం కొండా సురేఖ, మురళి దంపతులు. దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం కావడంతో.. ఇటు జిల్లాలోనూ.. అటు రాష్ట్రంలోనూ.. ఈ కుటుంబానికి ఫాలోయింగ్ ఉంది. ఉమ్మడి ఏపీలో అందునా.. వైఎస్ హయాంలో ఉమ్మడిరాష్ట్రంలో సురేఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక, రాష్ట్ర విభజనకు ముందు.. వైసీపీ ఏర్పాటుతో జగన్ కూటమిలోకి చేరారు. తర్వాత.. జగన్‌కు దూరమై టీఆర్ ఎస్‌లోకి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి.. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
ఇన్ని పార్టీలు మారిన దరిమిలా.. మరోసారి.. బీజేపీలోకి కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. తాము పార్టీ మారడం లేదని కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు. ``వరంగల్ తూర్పు మాదే..పార్టీ మరే ప్రసక్తే లేదు.. ఇది అంతా గిట్టని వారు చేస్తున్న ప్రచారం`` అని వ్యాఖ్యానించారు. కొండా దంపతుల కుమార్తె పుట్టిన రోజు వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు ఈ ప్రకటన చేయడం గమనార్హం.
``వరంగల్ తూర్పులో కొండా సురేఖ బరిలో ఉంటుంది. మరో సీటు ఇస్తే. మా కుటుంబంలో ఇద్దరం రెడీగా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో స్థానంలో కాంగ్రెస్ కి కష్టంగా ఉన్న స్థానంలో పోటీలోకి దిగేందు కు కూడా రెడీనే`` అని మురళి చెప్పడం గమనార్హం. తాము పార్టీ మారుతున్నామంటూ.. ప్రజలను అయో మయానికి గురిచేయవద్దన్నారు. తాము వేరే పార్టీలోకి వెళ్లడం లేదని తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా కిందనే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని రానున్న ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ పోటీ చేస్తున్నారన్నారు కొండా మురళి.
ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు చేసే నీచ రాజకీయాలను నమ్మవద్దని రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొండా దంపతులు ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకులని గానీ అధికార పార్టీ వాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా వాళ్ల కష్టసుఖాల్లో ఆపదలో కాపాడు కోవడానికి ముందుంటామని పేర్కొన్నారు.