Begin typing your search above and press return to search.
దేవినేని అవినాష్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన రాణిగారి తోట మహిళలు
By: Tupaki Desk | 10 Jan 2023 4:12 AM GMTఏ ముహుర్తంలో మొదలు పెట్టారో కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం అయిన గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం పార్టీ నేతలకు దిమ్మ తిరిగే షాకులు ఇస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులకు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యేలకు చేదు అనుభవాల్ని మిగిల్చిన ఈ కార్యక్రమం తాజాగా వైసీపీ నేత దేవినేని అవినాష్ కు షాకిచ్చిందని చెప్పాలి. స్థానిక కార్పొరేటర్ ను వెంట పెట్టుకొని మరీ ఆయన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన చేదు అనుభవం.. ఆయన నోట మాట రాకుండా చేసింది. విజయవాడ నగరంలోని విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న దేవినేని అవినాష్.. తాజాగా తన నియోజకవర్గం పరిధిలోని మహారాణి పేటలో పర్యటించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజలకు వివరించటంతో పాటు.. ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రజల నోటి నుంచి చెప్పించాలనుకున్న ఈ కార్యక్రమం తరచూ అభాసుపాలు కావటం తెలిసిందే.
స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డిని వెంట పెట్టుకొని వెళ్లిన దేవినేని అవినాష్ కు.. ఒక మహిళ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతున్న వైనాన్ని చూసిన దేవినేని.. ఆ ఇంటి మహిళను ఉద్దేశించి.. 'ఆ జెండా మనం పెట్టిందేనా?' అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఎస్కే రమీజా.. అవును.. మేమే పెట్టుకున్నాం. ఎందుకో తెలుసా? మమ్మల్ని ఆయన మోసం చేశారు (స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డిని చూపిస్తూ) అందుకే తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకున్నామని బదులిచ్చారు.
మీరు (దేవినేని అవినాష్) గుడివాడలో టీడీపీ తరపున ఫోటీ చేసినప్పుడు పార్టీ జెండా పెట్టామని.. మీ వెంట తిరిగినా.. కార్పొరేటర్ మాత్రం తమను మోసం చేశారని.. అందుకే తాము పార్టీ జెండాను అలానే పెట్టేశామని పేర్కొనటం గమనార్హం.
పిన చేసినోళ్ల జెండాలనే ఇళ్లపై పెట్టుకుంటామని చెప్పిన మహిళల మాటకు సమాధానం ఇవ్వలేని దేవినేని అవినాష్ హౌనంగా ఉండిపోయి.. ముందుకు వెళ్లిపోయారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఏమో కానీ.. ఇలాంటి షాకులతో దిమ్మ తిరిగిపోతుందన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.