Begin typing your search above and press return to search.
మిస్టర్ మోడీ.. థ్యాంక్యూ సోమచ్! మరే దేశం సాధించలేని చెత్త రికార్డు మనదే!
By: Tupaki Desk | 18 April 2021 4:30 AM GMTకరోనాను జయించాం. ప్రపంచాన్ని వణికించిన కంటికి కనిపించని మహమ్మారి.. భారత్ దెబ్బకు భయపడిపోయింది. ప్రపంచ దేశాల్ని వణికించొచ్చు కానీ. మా దగ్గర కాలర్ ఎగరేసే సీన్ కరోనాకు లేదంటూ.. నోటికి వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకునే వారంతా.. తాజాగా నమోదవుతున్న గణాంకాల్ని చూస్తే మంచిది. మొదటి దశలో భారీ నష్టం నుంచి తప్పించుకున్న వేళ.. అనవసర ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి.. సెకండ్ వేవ్ లో నెత్తి మీదకు తెచ్చుకున్న చూస్తే.. ఒళ్లు మండిపోవాల్సిందే.
సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. అన్ని తెలిసి.. అత్యంత సమర్థులుగా కీర్తి ప్రతిష్ఠల్ని అందుకునే పాలకులు సైతం అట్టర్ ఫ్లాప్ కావటమే కాదు.. ఈ రోజున కోట్లాది ప్రజలు వణికిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచంలో మరే దేశం.. దరిదాపుల్లోకి రానంత భారీ చెత్త రికార్డును మన పేరుతో నమోదయ్యే అద్భుతాన్ని ఆవిష్కరించుకున్న క్రెడిట్ భారతీయులకే దక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్న వేళ.. మిగిలిన వారెవరూ అందుకోలేనంత భారీగా కేసులు నమోదైన పరిస్థితి. దీని క్రెడిట్ ఎవరికి ఇద్దాం? కేంద్రంలోని మోడీ సర్కారుకా? దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలకా? అయినా.. పాలకులకు క్రెడిట్ ఇవ్వటం ఎందుకు?.. కేసుల పెరుగుదలలో ప్రత్యక్ష పాత్ర మాత్రమే కాదు.. తమకు తగ్గట్లు పాలించే పాలకుల్ని ఎన్నుకున్న ప్రజలకు ఇవ్వటమే సబబేమో?
ఇదిలా ఉంటే.. షాకింగ్ అంశం ఏమంటే.. కేవలం రోజు వ్యవధిలో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కొత్త కేసుల్లో ఏకంగా 30 శాతం (దగ్గర దగ్గరగా) మనవే కావటం గమనార్హం. శనివారం రాత్రి 11.30 గంటల వరకు ప్రపంచ వ్యాప్తంగా 8.08లక్షల కొత్త కేసులు నమోదు అయితే.. ఒక్క భారత్ లోనే 2.34 లక్షల కేసులు నమోదు కావటం గమనార్హం. కొత్త కేసుల నమోదులో అత్యధిక కేసులు నమోదవుతున్న టాప్ 8 దేశాల్లో.. భారత్ తొలి స్థానంలో నిలిచింది. కొంతలో కొంత నయం ఏమంటే.. మరణాల్లో రెండోస్థానంలో నిలవటం.
ఒక్కరోజులో కరోనామరణాల్లో బ్రెజిల్ మొదటిస్థానంలో నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్కరోజులో బ్రెజిల్ లో3070 మంది మరణించగా.. భారత్ లో 1341 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశంలో 762 మంది మరణించారు. ఇక.. కోవిడ్ కేసుల విషయానికి వస్తే.. రోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయంలోకి వెళితే..
1. భారత్ 2,34,692
2. బ్రెజిల్ 76,249
3. అమెరికా 65,612
4. ఫ్రాన్స్ 35,861
5. ఇటలీ 15,364