Begin typing your search above and press return to search.
హిందీ రాష్ట్రాల్లోనూ బాబు.. తెలుగు తెస్తారట
By: Tupaki Desk | 30 Nov 2017 8:26 AM GMTతెలుగు భాష అభివృద్ధి - పునర్వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే! ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం ప్రపంచాన్ని ఊపేస్తున్న నేపథ్యంలో మాతృభాషలకు పట్టకట్టడం.. బతికించుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక, తెలుగు విషయానికి వస్తే.. మరీ ఇబ్బందికరంగా మారింది. అయితే, దీనిని బ్రతికించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాల్సి ఉందని ఇప్పటికే పల్లె రఘునాథ రెడ్డి కమిటీ నివేదిక స్పష్టం చేసింది. దీనిని అమలు చేయాలని కూడా సభ్యులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే, వీటి మాట పక్కన పెట్టిన చంద్రబాబు.. తెలుగు రాష్ట్రమైన ఏపీలో తెలుగు మాట అటుంచి హిందీ రాష్ట్రాల్లో తెలుగును అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం చంద్రబాబు చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో.. తెలుగు భాషపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హిందీ రాష్ట్రాల్లో మూడో భాషగా తెలుగును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. తమిళనాడు - కర్ణాటక - పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తెలుగు భాష బోధనలు రద్దు చేసి చిన్నచూపు చూడడం బాధాకరమన్నారు. ఆయా రాష్ట్రాలతో మాట్లాడి రెండో అధికార భాషగా తెలుగు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. అదేసమయంలో త్రిభాషా సూత్రం ప్రకారం తెలుగు సాహిత్య - సంగీత - సాంస్కృతిక - గ్రామీణ సాంకేతిక - జానపద - చరిత్రకు సంబంధించి ఆరు ఆకాడమీలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఏపీ నృత్య - సంగీత - నాటక - జానపద అకాడమీలు త్వరలో ఏర్పాటు చేస్తామని బాబు చెప్పారు. మైసూరుకు తరలించాలనుకున్న ప్రాచీన భాషా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. న్యాయపాలనలోనూ తెలుగు అమలు కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతామని, తీర్పులు తెలుగులో వెలువరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లకు ఓసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న కమిటీ సూచనలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఏపీలో ఉండే ప్రభుత్వ - ప్రయివేటు - కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా తెలుగు నేర్చుకునేలా తెలుగు సబ్జెక్టును ప్రవేశపెట్టించే చర్యలు చేపడతామని చంద్రబాబు వివరించారు.
ఇదే సమయంలో సభ్యులకు చంద్రబాబు సైలెంట్ గానే చురకలంటించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఎన్ని మాట్లాడినా వారి వారి పిల్లలు, మనవళ్లను ఇంగ్లీష్ మీడియం వైపు మళ్లిస్తున్నారని చురకలు అంటించారు. చివరకు కూలీలు సైతం పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నారు. ఇప్పటి నుంచే తెలుగు పరిరక్షణకు ప్రాధాన్యం ఇద్దామన్నారు. తెలుగు పరిరక్షణ, అభివృద్ధికి ప్రపంచంలోని తెలుగువారంతా సహకరించాలన్నారు. మొత్తానికి చంద్రబాబు వ్యాఖ్యలు సర్వత్రా ఆశ్చర్యం కలిగించడం గమనార్హం.