Begin typing your search above and press return to search.
చచ్చింది రాజునో కాదో.. చూసిన తర్వాతే నమ్ముతాం: బాధిత బాలిక కుటుంబ సభ్యులు
By: Tupaki Desk | 16 Sep 2021 6:59 AM GMTసైదాబాద్ లో బాలికను రేప్ చేసి చంపిన నిందితుడు రాజు కోసం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్న వేళ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేసు ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్-వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు గమనించారు.
నగర నడిబొడ్డులోని సైదాబాద్-సింగరేణి కాలనీలో హత్యాచారం చేశాక రాజు తప్పించుకున్నాడు. అతడు చివరి సారి ఉప్పల్ లో కనిపించాడు. తర్వాత అతడి ఆచూకీ కోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు. 10 లక్షల రివార్డ్ ప్రకటించారు. చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
కాగా నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలపై హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు స్పందించారు. నిందితుడు రాజు ఆత్మహత్యపై బాధిత చిన్నారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తమ కళ్లతో చూసిన తర్వాతే నమ్ముతామని చెప్పారు.
చాలా మంది టాటూలు వేయించుకుంటారని.. మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్ కు తీసుకురావాలన్నారు. మరోవైపు రాజు ఆత్మహత్యపై పోలీసుల సమాచారం అందుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.