Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి కోసం 10వేల కోట్లు అప్పు కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   30 Sep 2018 4:51 AM GMT
అమ‌రావ‌తి కోసం 10వేల కోట్లు అప్పు కావాల‌ట‌!
X
అప్పు మీద అప్పులు తేవ‌టం ఏపీ స‌ర్కారుకే సాధ్య‌మ‌వుతుందేమో. అధికారంలోకి వ‌చ్చిన గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో భారీగా అప్పులు చేసిన ఏపీ స‌ర్కారు తాజాగా మ‌రో రూ.10వేల కోట్ల అప్పుకోసం భారీ ప్లాన్ వేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మౌలిక స‌దుపాయాల కోసం ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.10వేల కోట్ల అప్పు అవస‌ర‌మంటూ రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తాజాగా ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

ఇప్ప‌టికిప్పుడు రూ.10వేల కోట్లు అప్పులు చేయ‌ని ప‌క్షంలో ఇప్ప‌టికే చేప‌ట్టిన ప్రాజెక్టులు నిలిచిపోతాయ‌ని సీడీఆర్ చెబుతోంది. రాజ‌ధాని కోసం రైతుల నుంచి స‌మీక‌రించిన భూములను వాణిజ్య బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టి రుణాన్ని తీసుకోవాల‌ని భావిస్తోంది. ఈ ప్ర‌క్రియ పూర్తి అయ్యేందుకునాలుగైదు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని.. ఈ రుణాల‌కు రాష్ట్ర స‌ర్కారు త‌ర‌ఫున గ్యారెంటీ ఇవ్వాలంటూ సీఆర్ డీఏ ప్ర‌తిపాద‌న‌లు చేసింది.

అమ‌రావ‌తి కోసం ఇప్ప‌టికే బాండ్ల రూపంలో రూ.2వేల కోట్లు స‌మీక‌రించిన సీఆర్డీఏ .. ఇందుకోసం 10.32 శాతం వ‌డ్డీని క‌ట్టేందుకు సైతం వెనుకాడ‌లేదు. 8 శాతం కంటే ఎక్కువ రుణం తీసుకోవ‌ద్ద‌ని.. ఇప్ప‌టికే హ‌డ్కో ద్వారా తీసుకున్న రుణంపై వ‌డ్డీని త‌గ్గించాల‌ని ఆర్థిక శాఖ కోరుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మ‌రో రూ.10వేల కోట్లు అప్పు కావాల‌ని కోర‌టంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. వేలాది కోట్లు అమ‌రావ‌తి పేరుతో తీసుకొస్తున్నా.. అందుకు త‌గ్గ‌ట్లుగా ఎలాంటి అభివృద్ది అమ‌రావ‌తిలో క‌నిపించ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అప్పుల మీద అప్పులు చేస్తున్న బాబు స‌ర్కారు పుణ్య‌మా అని..రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంత‌కంత‌కూ కుంచించుకుపోతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అప్పుల‌తోనే బండి న‌డిపించ‌టానికి బాబే కావాలా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది.