Begin typing your search above and press return to search.

చైనా తుపాకులు మమ్మల్ని ఏమి చేయలేవు : దలైలామా

By:  Tupaki Desk   |   25 Dec 2019 9:38 AM GMT
చైనా తుపాకులు మమ్మల్ని ఏమి చేయలేవు : దలైలామా
X
నేడు క్రిస్మస్‌ పండుగ శుభ సందర్భంలో బౌద్ధ గురువు దలైలామా చైనాను ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు. మా వద్ద సత్యం ఉంది. కమ్యూనిస్టు చైనా వద్ద తుపాకులు - ఆయుధాలు ఉన్నాయి. కానీ ఎప్పటికైనా ఈ భూ ప్రపంచంలో ఆయుధ శక్తి మీద సత్యమే గెలుస్తుంది - గెలిచి తీరుతుంది అని అయన చెప్పారు. ప్రపంచంలోనే బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. అక్కడి బౌద్ధులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తాము నమ్మే బౌద్ధమే నిజమైనదనే అభిప్రాయానికి వస్తున్నారని అన్నారు. దలైలామా ప్రస్తుతం బీహార్‌ లోని బుద్ధగయలో ఉన్నారు. దలైలామా బుద్ధుల మత గురువే కాదు ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత కూడా.

జనవరి 6న జరిగే బోధిసత్వునికి సంబంధించిన కార్యక్రమంలో దాదాపు 50వేల మంది బౌద్ధులనుద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. దలైలామాను అనుసరించే చైనా బౌద్ధుల్లో అధిక శాతం మంది చైనా వెలుపలే ఉన్నారు. కాగా, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 1959లో భారతదేశానికి శరణార్థిగా వచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కొండ ప్రాంతమైన ధర్మశాలలో ఆయన నివాసముంటున్నారు. కానీ, చైనా మాత్రం దలైలామాను టిబెట్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగా గుర్తిస్తోంది.

ఇకపొతే , మరోవైపు ఈ దలైలామా తరువాత దలైలామా ఎవరు అన్న విషయంలో సాంప్రదాయాన్ని కొనసాగించాలని చైనా పట్టుబడుతుండగా - టిబెట్లు మాత్రం చైనా చేస్తోన్న ఒత్తిడిని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై దలైలామా మాట్లాడుతూ .. తదుపరి దలైలామా ఎవరనే దానిపై బయట ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? ప్రస్తుతం నాకు 85 ఏళ్లు . అయినప్పటికీ నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను. ఇప్పుడే తదుపరి దలైలామా ఎవరు అన్న దానిపై చర్చ దేనికి అంటూ మాట్లాడారు. ఇక ప్రస్తుత ఈ దలైలామాను కనుగొనడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.