Begin typing your search above and press return to search.
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..4ఏళ్లలో 3లక్షల ఉద్యోగాలు
By: Tupaki Desk | 3 Dec 2019 10:43 AM GMTప్రస్తుతం ఐటి రంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ లో తమ వ్యాపారాన్ని ప్రారంభించాయి. గత అయిదేళ్లలో గూగుల్ - ఆపిల్ - మైక్రోసాఫ్ట్ - క్వాల్ కామ్ - మైక్రాన్ - అమెజాన్ - ఉబెర్ - ఒప్పో వంటి ప్రాజెక్టులు వచ్చాయని - డెల్లాయిట్ ఇలా ఎన్నో అగ్ర సంస్థలు హైదరాబాద్ కి వచ్చాయి. దీనితో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి.
ఇకపోతే వచ్చే నాలుగేళ్ళలో తెలంగాణాలో భారీ ఉద్యోగాల జాతరేనా? అంటే అవుననే వినిపిస్తోంది. తెలంగాణ ఐటి - మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెబుతున్న మాటలు నిజమైతే రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్ళలో భారీ స్థాయిలో ఐ.టి. ఉద్యోగాల జాతరే. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. ఇప్పటికే రెండు ఐ.టి. క్లస్టర్స్ తో తెలంగాణ ఐటి రంగంలో దూసుకుపోతోందని, తాజాగా కేంద్రాన్ని మూడో ఐ.టి. క్లస్టర్ అడిగామని - అది కనుక సాంక్షన్ అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు సుమారు 3 లక్షల మేరకు ఐటి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
హైదరాబాద్ రెండో ఐటి క్లస్టర్ ఏరియాలో కెటీఆర్… ఇంటెల్ డెవలప్ మెంట్ యూనిట్ ను సోమవారం ప్రారంభించారు. ఆ తర్వాత మంగళవారం ఐటి అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష జరిపారు. గత అయిదేళ్ళలో సుమారు లక్ష మేరకు ఐటి ఉద్యోగాలు వచ్చాయని సమీక్షలో వెల్లడైంది. మూడో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ మంజూరులో కేంద్ర సహకరిస్తే వచ్చే నాలుగు సంవత్సరాలలో హైదరాబాద్ లో ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందని కెటీఆర్ అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయిన సందర్భంలో హైదరాబాద్ కు మూడో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరినట్లు కెటీఆర్ తెలిపారు. అలాగే ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తుందని కెటీఆర్ చెప్పారు.