Begin typing your search above and press return to search.

ఆ ‘చోటా’ను ఈ ‘చోటా’ జైల్లోనే లేపేస్తాడట

By:  Tupaki Desk   |   26 Dec 2015 7:01 AM GMT
ఆ ‘చోటా’ను ఈ ‘చోటా’ జైల్లోనే లేపేస్తాడట
X
అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం షష్టిపూర్తి కార్యక్రమాలకు సంబంధించి సందడి నెలకొన్నా.. పగలు.. ప్రతీకారాలు.. హత్యల గురించి మాత్రం మర్చిపోలేదు. దావూద్ కు కుడిభుజం లాంటి చోటా షకీల్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఫోన్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తమకు శత్రువైన చోటా రాజన్ తో ఉన్న వైరాన్ని ప్రస్తావించటమే కాదు.. సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చోటా రాజన్ ను లేపేసేందుకు చాలాసార్లే ప్రయత్నం చేశామని.. ప్రతిసారీ తృటిలో మిస్ అవుతున్నాడని.. ఈసారి అలా జరగదని చెప్పాడు. ప్రస్తుతం చోటారాజన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న నేపథ్యంలో సేఫ్ గా ఉన్నాడని అనుకుంటారని.. కానీ.. అతన్ని అక్కడే లేపేస్తామని షకీల్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. ఇండోనేషియా బాలి ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన సందర్భంలో అతన్ని లేపేసేందుకు ప్రయత్నించామని.. అయితే.. అయుధాలు చేరే విషయంలో జరిగిన చిన్నపాటి ఆలస్యంతో అక్కడ టార్గెట్ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. తాజాగా చోటా రాజన్ మీద చోటా షకీల్ చేసిన వ్యాఖ్యలు భారత అధికారులు పెద్ద సవాలుగా మారతాయనటంలో సందేహం లేదు.