Begin typing your search above and press return to search.
పవన్ ను రాయలసీమలో అడుగే పెట్టనివ్వరట
By: Tupaki Desk | 27 May 2017 10:24 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తొలి ఎన్నికల పోటీకి రాయలసీమనే వేదికగా ఎంచుకున్నాడు. రాయలసీమలో అత్యంత వెనుకబడ్డ జిల్లాగే పేరు పడ్డ అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఐతే పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయడం తర్వాత.. ఆయన్ని అసలు ఈ ప్రాంతంలోనే అడుగు పెట్టనివ్వబోమని అంటున్నాడు రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ ఆర్ ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి. పవన్ కల్యాణ్ తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఎప్పుడు పడితే అప్పుడు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించాడు. కుంచం శుక్రవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ కు హెచ్చరికలు జారీ చేశాడు.
‘‘రాయలసీమ నుంచి పోటీ చేస్తానని అంటున్నావు. అసలు రాయలసీమలో నీకేం పని. కోస్తాంధ్రలో పోటీ చేసుకో. రాయలసీమలో నిన్ను అడుగు పెట్టనివ్వం’’ అని కుంచం అన్నాడు. తెలుగు రాష్ట్ర పాలకులందరూ సీమ ప్రజలను వాడుకున్నారని.. ఇప్పుడు పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణిలో సాగుతున్నారని.. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి సీమ నుంచి గెలిచి పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని.. తన అన్న లాగా పార్టీని అమ్ముకోవడానికే రాయలసీమ నుంచి పవన్ పోటీ చేయబోతున్నాడని కుంచం విమర్శించాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మీదా కుంచం విమర్శలు గుప్పించాడు. రాష్ట్రం విడిపోయాక అన్నీ విజయవాడలోనే ఏర్పాటు చేస్తే రాయలసీమ గతేంటని ఆయన ప్రశ్నించాడు. సీఎం చంద్రబాబు సైతం సీమపై సవతి తల్లి ప్రేమ చూపుతూ.. అమరావతి పేరుతో ఉన్నదంతా కోస్తాకే దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీమ సమస్యలకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే పరిష్కారమని, ఆ దిశగా పోరాటం ఉధృతం చేస్తామని కుంచం అన్నాడు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి 11 జిల్లాలతో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/