Begin typing your search above and press return to search.
ఆర్థిక వ్యవస్థలో మనం చైనాను దాటేస్తాం.. ఎప్పుడో తెలుసా?
By: Tupaki Desk | 8 Dec 2021 11:30 PM GMTప్రస్తుతం కరోనా కారణంగా.. గత రెండేళ్లుగా మన దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉంది. నిజానికి నరేంద్ర మోడీ సర్కారు తొలి పాలనలో తీసుకువచ్చిన డీమానిటైజేషన్ కారణంగా.. ఆర్థిక వ్యవస్థ దబ్బతింది. తర్వాత.. కోలుకుంటున్న క్రమంలో 2020లో వచ్చిన కరోనా..కుంగదీసింది. దీంతో భారత్ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే.. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు.. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను పరిశీలనలోకి తీసుకుంటే.. వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో భారత్ ఆర్థికంగా భారీగా పుంజుకుంటుందని అంటున్నారు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్.
ఇటీవల కాలంలో స్టాక్ ఎక్సేంజ్ విషయంలో పెట్టుబడిదారులకు, కంపెనీలకు ఆశావాద ధృక్పదం మొదలైంది. ఈ క్రమంలో ఈక్విటీల షేర్లు, పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది స్థిరంగా కొనసాగితే.. వచ్చే మూడు నాలుగు దశాబ్దాల్లో భారత్.. చైనా దూకుడును మించి ఆర్థికంగా పుంజుకుంటుందని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. లీడర్స్ ఆఫ్ గ్లోబల్ భారత్ ఇంటర్వ్యూ సిరీస్‌లో భాగంగా మాట్లాడిన ఆయన కరోనా తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఎన్నో మార్పులొచ్చాయని పేర్కరొన్నారు. సాధారణ పెట్టుబడిదారుల నుంచి కంపెనీల వరకూ డబ్బు భద్రత గురించి ఆందోళన మొదలైందని తెలిపారు. సెన్సెక్స్‌ను ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బేరోమీటర్‌గా చూడాలన్నారు.
గత మార్చిలో కరోనా కారణంగా మార్కెట్లు పతనమైనప్పుడు.. సూచీలు క్షీణించాయని పేర్కొన్నారు. కానీ, భారత్ సహా.. ప్రపంచంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని.. తెలిసిన తర్వాత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు..కూడా BSE తెరిచే ఉంది. అప్పుడు పలువురు విమర్శించారన్నారు. నాలుగు కోట్ల పెట్టుబడిదారుల ఖాతాలను చేరుకోవడానికి మాకు అక్షరాలా 45 సంవత్సరాలు పట్టిందన్నారు. గత ఏడాదిన్నరలో 80 శాతానికి చేరుకున్నామని తెలిపారు. మార్కెట్‌లలోని అనుభవజ్ఞుల సూచనల ప్రకారం.. నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తాము.. భారత్ కంటే.. అమెరికన్ ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా పని చేస్తామన్నారు.
కోవిడ్-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 20 శాతం పడిపోయిందని.. ఇప్పుడు మాత్రం.. వృద్ధి రేటు దూసుకెళ్తోందని తెలిపారు. అయితే.. పెట్టుబడులు పెట్టేందుకు తాను అంపైర్ మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఆవిష్కరణలతో ఈరోజు తొమ్మిది కోట్ల పెట్టుబడిదారుల ఖాతాలకు బీఎస్‌ఈ చేరినప్పటికీ తక్కువ పెట్టుబడితో ఉన్నామన్నారు. డూప్లికేట్ ఖాతాల్లాంటివి ఉన్నందున మనం దాదాపు 15-20 రెట్లు ఎక్కువ చేరుకోవాలని పేర్కొన్నారు. కాబట్టి, భవిష్యత్తులో ఖాతాల సంఖ్య 150 కోట్లు ఉన్నా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు చాలా తక్కువన్నారు. స్టాక్ మార్కెట్‌లు పొదుపులను ఉత్పాదక పెట్టుబడిగా మార్చడానికి మధ్యంతరానికి మంచి మార్గమని.. కంపెనీలు కోరుకునేది అదేనని చౌహాన్ తెలిపారు.
పొదుపు నుండి ఈక్విటీతో పెట్టుబడుల వరకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు. అవగాహన ముఖ్యమని తెలిపారు. ప్రజలు ఖాతాలను తెరవడం, వ్యాపారం చేయడం సులభం చేయడం ద్వారా, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేరుకోవచ్చన్నారు. ట్రేడింగ్ డెరివేటివ్‌లలో పెట్టుబడి పెట్టవద్దని.. ఉదయం కొనుగోలు చేయడం, మధ్యాహ్నం విక్రయించడం లాంటి చర్యలు పెట్టుబడి కాదన్నారు. మొత్తంగా మార్పు ఖాయమని.. చౌహాన్ తెలిపారు.