Begin typing your search above and press return to search.
137 సీట్లు గెలిచేస్తానంటున్న జగన్
By: Tupaki Desk | 22 Nov 2017 7:09 AM GMTఒక్క లక్ష్యం కోసం భారీ శ్రమకే సిద్ధమయ్యరు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదలతో ఉన్న జగన్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు. తనను చూసేందుకు.. తన మాట వినేందుకు తపిస్తున్న అశేష ప్రజానీకాన్ని చూస్తున్న జగన్ కు.. తన గెలుపు మీద ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా చేస్తున్న పాదయాత్రలో ఊహించని రీతిలో భారీ హామీలు ఇస్తున్న జగన్ ఏపీ అధికారపక్షానికి చెమటలు పుట్టిస్తున్నారు. మరోవైపు జగన్ హామీలతో విపక్ష నేతల్లో సంతోషం అంతకంతకూ పెరుగుతోంది. తాను సీఎం కావాలన్న ఆశను.. ఆకాంక్షను జగన్ ఎప్పుడు దాచుకోలేదు.
అన్న వస్తున్నాడంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న జగన్.. మహా అయితే మరో ఏడాది అగితే చాలు.. మీరు కోరుకుంటున్న ప్రభుత్వం కొలువు తీరుతుందని చెబుతున్నారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏమేం చేస్తానన్న విషయాన్ని డిటైల్డ్ గా ఏ రోజుకు ఆ రోజు చెప్పేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా తన పాదయాత్రలో భాగంగా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన జగన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 137 సీట్లు గెలుచుకోనున్నట్లు చెప్పారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 137 సీట్లు విజయం పక్కా అన్నది జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందన.. సామాన్యుల్లో ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి.. ఆగ్రహం. మూడున్నరేళ్లు గడిచినా ఏపీ సర్కారు తమకేం చేయలేదన్న నిరాశ ఎక్కువగా ఉన్నట్లు జగన్ బ్యాచ్ ఆలోచిస్తుట్లు చెబుతున్నారు. ప్రజాదరణను అంచనా వేసిన తర్వాత సీట్ల లెక్క చెప్పి ఉంటారని భావిస్తున్నారు.
జగన్ చెబుతున్న లెక్క ఏపీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం సీట్లలో దాదాపు 80 శాతం సీట్లు తమవేనన్న నమ్మకాన్ని జగన్ వ్యక్తం చేయటం గమనార్హం. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షానికి సీట్లు రావొచ్చు కానీ ఇంత భారీగా రావటం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. ఇదంతా మైండ్ గేమ్ లో భాగంగానే జగన్ వ్యాఖ్యానించారన్న మాటా వినిపిస్తోంది. ఉలిక్కిపడేలా చేయటం కోసమే జగన్ నోటి నుంచి ఈ సీట్ల లెక్క వచ్చి ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన వాళ్ల సంగతిని పక్కన పెడితే.. జగన్ నోటి నుంచి ఆ స్థాయి సీట్లు వస్తాయన్న ప్రకటన వెనుక మర్మం వేరుగా ఉంటుందని చెబుతున్నారు. అయితే సర్వే కానీ.. లేదంటే ఫీడ్ బ్యాక్ తోనే లెక్కలు వేసి ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న లెక్కలతోనే తాజా ఫిగర్ ను జగన్ చెప్పి ఉంటారని చెబుతున్నారు. తాము ఎన్ని సీట్లలో విజయం సాధించే విషయంపై జగన్ చేసిన వ్యాఖ్యలు విపక్ష నేతలకు సంతోషాన్ని కలిగించగా.. అధికారపక్షం నేతలు మాత్రం ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలిచే సీట్ల లెక్క చెప్పటం ద్వారా జగన్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారని చెప్పాలి. అందరి దృష్టిని తన మీద తిప్పుకోవటంలో జగన్ ప్రాధమికంగా విజయం సాధించారని చెప్పక తప్పదు.