Begin typing your search above and press return to search.

అలర్ట్ : వీక్ అవుతున్న వ్యాక్సీన్లు.. స్ట్రాంగ్ అవుతున్న వైరస్

By:  Tupaki Desk   |   20 March 2022 5:30 AM GMT
అలర్ట్ : వీక్ అవుతున్న వ్యాక్సీన్లు.. స్ట్రాంగ్ అవుతున్న వైరస్
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఒక దేశంలో ఉంది మరో దేశంలో లేదు అని కాకుండా ప్రతి దేశంలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే భారత్ లో కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కానీ ఇతర దేశాల్లో మాత్రం మరల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక హెచ్చరిక జారీ చేసింది. కరోనా మహమ్మారి ఇంకా బలంగా ఉందని చెప్పింది.

గతంలో పాటించిన విధంగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్తుంది. కోవిడ్ ఇంకా బలపడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లు మరిన్ని పట్టుకుని రావచ్చని చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రజలు ఎవరూ కూడా వైరస్ ను తక్కువ అంచనా వేయవద్దు అని అంటుంది. అందుకో మరోసారి వైరస్ వ్యాప్తికి సంబంధించి మరోసారి కొన్ని కీలక సూచనలు జారీ చేసింది.

సుమారు రెండేళ్ల తర్వాత చైనాలో కోవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. చైనాలో కేసులు పెరిగిన ప్రతీసారి ఏదో ఒక రూపంలో కోవిడ్ కల్లోలం కొనసాగుతుంది. దీంతో పెరుగుతున్న కేసులు మరింత భయపడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అంతేగాకుండా ఇప్పటికీ వైరస్ కు సంబంధించిన కొన్ని కొత్త వేరియంట్లు పుట్టుకు రావచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే నాలుగో వేవ్ కచ్చితంగా వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.

ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఆసియాలోని చైనాతో పాటు హాంకాంగ్ లో కూడా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు యూరోపియన్ దేశాల్లో కూడా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మరణాలు సంఖ్య పెద్దగా లేకపోవడం తో ప్రజలూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ వైరస్ వ్యాప్తిలో ఇంకా ఎక్కువగానే ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ చెప్తూనే ఉంది. దీంతో ప్రజలు కచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

మరో వైపు చైనాలో సుమారు రెండేళ్ల తర్వాత కేసుల సంఖ్య భారీగా వెలుగు చూడడమే కాకుండా ఇప్పటికే రెండు మరణాలు కూడా సంభవించినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకుగానూ చైనాలో చాలా ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించినట్లు పేర్కొన్నారు.

వైరస్ మరింత బలపడడంతో పాటు వ్యాక్సిన్ లు తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుముఖం పడుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ ఇంకా సీజనల్ వ్యాధిలా మారలేదని అంటున్నారు. అందుకే కోవిడ్ ప్రోటో కాల్ పాటించాలని ముఖ్యంగా వ్యక్తుల మధ్య దూరం తో పాటు, మాస్కులు ధరించడం వంటివి చేయాలని పేర్కొన్నారు.