Begin typing your search above and press return to search.
బ్లూ జీన్స్ ధరిస్తే…ఇక అంతే సంగతులు !
By: Tupaki Desk | 29 Jun 2021 11:30 AM GMTనార్త్ కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ పై వచ్చినన్ని పుకార్లు, వార్తలు ఇతర ఏ దేశాధినేత పైనా రాలేదు. నార్త్ కొరియా పై ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు వస్తుంటాయి. ఆయన ఆరోగ్యంపైనా కూడా ఆ వార్తలు అనుమానాలను క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఇంతలా ప్రచారం జరగడానికి కారణం కిమ్ జాంగ్ వైఖరితోపాటు ఆ దేశంలో ఉన్న నియమ నిబంధనలే కారణం. కఠిన చట్టాలను అమలు చేసే ఉత్తర కొరియాలో ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత ఆంక్షలు కనిపిస్తుంటాయి. ఉత్తర కొరియాలో కేవలం నాలుగే అధికారిక ఛానెల్స్ ఉంటాయి. అవి తప్పితే మిగతా టీవీ ఛానెల్స్ ఏవీ ఉండవు. ఇక్కడ ప్రభుత్వ సెన్సార్ షిప్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రభుత్వం ఎలా చెబితే అక్కడి ప్రజలు అలా నడుచుకోవాల్సిందే. అతిక్రమించి ఎవరూ కూడా అక్కడ బతికి బట్టకట్టలేరు.
కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు ఎవరూ కూడా దుస్తులు ధరించకూడదు. బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్వవహరిస్తుంది. పాశ్చాత్యపోకడలకు ఆ దేశం కొంచెం దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో జీన్స్ లకు అనుమతి ఇస్తున్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో కూడా ఉత్తర కొరియాలో బ్లూకలర్ జీన్స్ ధరించకూడదు. ఎందుకంటే ఆ రంగు అమెరికాను సూచిస్తుందట. అమెరికా అంటే కొరియాకు అస్సలు పడదు. కొరియాలో కిమ్ పాలన మొదలయ్యాక రెండు దేశాల మధ్య దూరం మరింతగా పెరిగింది. ఉత్తర కొరియాలో మీకు ఇష్టమైన జుట్టు కత్తిరించుకోలేరు. ప్రజల జుట్టు కత్తిరింపుల కోసం ప్రభుత్వం కొన్ని డిజైన్లను విడుదల చేసింది. ఉత్తర కొరియాలో నివసించే ప్రజలు ఈ డిజైన్లలో ఒకదాన్ని ఇష్టపడటం ద్వారా జుట్టు కత్తిరించుకోవచ్చు. ఉత్తర కొరియాలో సాధారణ పౌరులు ఇక్కడ కార్లు కొనలేరని ఒక చట్టం ఉంది. సైన్యం మరియు ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇక్కడ కార్లను ఉంచడానికి అనుమతిస్తారు. నార్త్ కొరియాలో బర్త్ కంట్రోల్‌కు సంబంధించిన అన్ని విధానాలపై నిషేధం ఉంది. దీంతో ఇక్కడ కండోమ్స్ దొరకడం అసాధ్యం.