Begin typing your search above and press return to search.
డార్క్ వెబ్ లో కరోనా రక్తం - లాలాజలం..అసలేంటి కథ?
By: Tupaki Desk | 24 April 2020 2:30 AM GMTశతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ఇప్పుడు కరోనాతో జనాలు చస్తుంటే.. దాన్ని కూడా ‘క్యాష్’ చేసుకునే దుర్మార్గులు మన సమాజంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు..
తాజాగా కొందరు గూగుల్ - యాహూ సహా సెర్చింజన్లలో కనిపించని ‘డార్క్ వెబ్ సైట్లలో’ కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం, లాలాజలం అమ్మడం కలకలం రేపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. వారి రక్తంతో మీకు కరోనా తగ్గిపోతుందని ప్రకటనలు ఇచ్చారు. దాదాపు 1000 డాలర్లకు ఇది అమ్ముతామని తెలిపారు. కరోనా వైరస్ ను ఇలా ప్రజల్లో భయాలు సృష్టించి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సైట్లలో లాగిన్ అయ్యి సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికే వారి వెబ్ సైట్ కనిపిస్తుంది. సాధారణ జనాలకు కనిపించదు.
ఇక ఇజ్రయిల్ సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని.. 99 డాలర్లు చెల్లిస్తే వ్యాక్సిన్ కలిగిన 10 వాయిల్స్ పంపిస్తామని డార్క్ వెబ్ సైట్స్ లో ప్రకటనలు ఇస్తున్నారు. ఇది నిజమే అనుకొని చాలా మంది వెబ్ సైట్ లలోకి వెళుతూ డబ్బులు చెల్లించి మోసపోతున్నారు.
దీనిపై అమెరికా సహా వివిధ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. డబ్బులు కట్టించుకొని వీరు మాయమవుతారని.. ఇదో పెద్దస్కామ్ అని ఎవరూ ఈ డార్క్ వెబ్ సైట్లను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచిస్తున్నారు. అసలు కరోనాకు మందు వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టలేదని చెబుతున్నారు.