Begin typing your search above and press return to search.

మోడీ వ‌ల్ల ర‌ద్ద‌యిన పెళ్లి!

By:  Tupaki Desk   |   12 July 2017 10:44 AM GMT
మోడీ వ‌ల్ల ర‌ద్ద‌యిన పెళ్లి!
X
అవును సాక్షాత్తు ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ వ‌ల్లే...ఆ ఇద్ద‌రు ప్రేమికులు విడిపోయారు. వారి క‌ల‌ల జీవితం కాస్త క‌న్నీటి ప‌ర్యంతంగా మారిపోయింది. ఏంటి మ‌న ప్ర‌ధానిగారు ఎందుక‌లా చేశారు అంటే డైరెక్టుగా ఏం చేయ‌లేదు. ప‌రోక్షంగా ఓ పెళ్లి ర‌ద్ద‌వ‌డానికి కార‌ణ‌మ‌య్యారు. ఇండియాలో రాజ‌కీయాలు ఎంత‌లా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయి అన‌డానికి ఇదో మంచి ఉదాహ‌ర‌ణ అని కూడా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై త‌మ అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయ‌ని త‌మ పెళ్లిని ర‌ద్దు చేసుకుంది ఈ జంట‌.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని ఓ వ్యాపారి ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ మ‌హిళ‌ను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. గుడిలో త‌మ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఇద్ద‌రూ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా యువ‌జంగా కాసేపు మాట్లాడుకున్నారు. అలా ఆ ముచ్చ‌ట్లు ప్రేమ నుంచి మొద‌లుకొని ప్ర‌పంచ ప‌రిణామాల‌వైపు మ‌ళ్లింది. ఈ క్ర‌మంలోనే దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నం వైపు ఆ కాబోయే దంప‌తుల‌ టాపిక్ మ‌ళ్లింది. ఆర్థిక వ్య‌వ‌స్థ వ‌చ్చిన‌పుడు స‌హ‌జంగానే అందులో ప్ర‌ధాని మోడీ వ‌చ్చేశారు. దీంతో చ‌ర్చ రూపం మారిపోయింది. ఆ ఇద్దరిలో మోడీజీ మద్దతుగా ఒక‌రు.. విమ‌ర్శిస్తూ మ‌రొక‌రు చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ వేడెక్కింది. మోడీపై అభిప్రాయాలు ఏకీభ‌వించ‌లేదు. దీంతో ఎవ‌రి దారి వాళ్లు చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదండి మోడీజీ విడదీసిన పెళ్లికాని జంట క‌థ‌!