Begin typing your search above and press return to search.
విమానంలో పెళ్లి.. ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది
By: Tupaki Desk | 25 May 2021 3:30 AM GMTఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన సామెత గుర్తుంది కదా? ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. వాళ్లెవరో ఫ్లైట్ లో పెళ్లి చేసుకోవటం ఏమిటి? మీరు నిబంధనల్ని పాటించరా అంటూ సదరు విమాన సిబ్బందిపై వేటు వేసి.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు.. ఈ ఉదంతంలో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బెంగళూరు నుంచి మధురై వెళ్లే విమానంలో.. ఒక జంట విమానంలో గాల్లో ఉండగానే పెళ్లి చేసుకున్న వైనం సంచలనంగానూ.. విపరీతంగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో భారీ ఎత్తున జరిగిన ప్రచారం ఇప్పుడు కొత్త రచ్చకు తెర తీసింది. కొవిడ్ 19 నిబంధనల్ని ఏ మాత్రం పాటించకుండా ఫ్లైట్ లో పెళ్లి చేసుకున్న వైనంపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు విచారణకు ఆదేశించారు. అంతేకాదు.. విమాన సిబ్బంది మీదా వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు లోని మధురైకి చెందిన రాకేశ్.. దక్షిణలు.. వారి బంధువర్గం మొత్తం 161 మంది విమానంలో బయలుదేరటం.. ప్రయాణ సమయంలోనే ఫ్లైట్ లోనే పెళ్లి చేసుకోవటం తెలిసిందే.
దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కోవిడ్ వేళ.. ఈ హంగామా ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఫ్లైట్ లో ఎవరూ కొవిడ్ నిబంధనల్ని పాటించకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో స్పైస్ జెట్ వివరణ ఇస్తూ.. పెళ్లి కోసం విమానాన్ని బుక్ చేసుకుంటున్నట్లుచెప్పలేదని.. జర్నీ కోసమే చెప్పిన వారు ప్రయాణ సమయంలో పెళ్లి చేసుకున్నారని విమానయాన సంస్థ వెల్లడించింది.
ప్రయాణ సమయంలో కొవిడ్ నిబంధనల్ని పాటిస్తామని తమకు హామీ ఇచ్చారని స్పైస్ జెట్ చెప్పింది. ఈ ఉదంతంపై విమర్శ రావటంతో పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగింది. మరోవైపు మధురై కలెక్టర్ కూడా ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు షురూ చేశారు. రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేయటం బాగానే ఉన్నా.. రాంగ్ టైమింగ్ లో నిబంధనలకు విరుద్ధంగా చేయటం ఒక సమస్య అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో విమాన సిబ్బంది బకరాలు అయ్యారన్న మాట వినిపిస్తోంది.