Begin typing your search above and press return to search.

ఫేమస్ అవ్వడానికి మేకతో పెళ్లేంటి బాబు..

By:  Tupaki Desk   |   12 Jun 2022 2:30 AM GMT
ఫేమస్ అవ్వడానికి మేకతో పెళ్లేంటి బాబు..
X
ఓ ఊర్లో మీటింగ్కి వచ్చిన మంత్రి ని హీరో రాయితో కొడతాడు. అప్పుడు పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైల్లో పెడతారు. ఇంతకీ మంత్రిని ఎందుకు కొట్టావు రా అంటే ఫేమస్ అవ్వడానికి కొట్టానని చెబుతాడు హీరో. ఆ సమాధానం విని మంత్రితో పాటు పోలీసులూ షాక్ అవుతారు.

ఇలా సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ చాలా మంది ఫేమస్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వారికి సరైన వేదిక దొరికనట్టైపోయింది. అలా ఫేమస్ అవ్వాలనుకున్న ఓ వ్యక్తి చాలా వింత పని చేశాడు. 22 వేల రూపాయలు కట్నంగా ఇచ్చి ఓ ఆడ మేకను పెళ్లి చేసుకున్నాడు.

ఫేమస్ అవ్వాలని కొందరు ఎంత రిస్క్ అయినా చేస్తారు. మరికొందరేమో సిల్లీ పనులు చేసి ఫేమస్ అయిపోతారు. సినిమా హీరో నా తండ్రి అని చెప్పుకుని కొందరూ.. గత జన్మలో తాము ఫలానా రాజు అని చెప్పుకుని మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో ప్రజల అటెన్షన్ని తమ వైపు తిప్పుకుని ఫేమస్ కావాలని చూస్తుంటారు కొందరు. ఇలాంటి వారి పనిని సోషల్ మీడియాలు మరింత ఈజీ చేస్తున్నాయి. ఏదో సిల్లీ కంటెంట్ పెట్టడం వైరల్ చేయడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది.

ఇండోనేషియాకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆడ మేకను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇదంతా కేవలం వైరల్ అయి.. తాను ఫేమస్ కావడం కోసమే. సైఫుల్ ఆరిఫ్(44) అనే వ్యక్తి జూన్ 5వ తేదీ గ్రెసిక్‌లోని బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో రహయు బిన్ బెజో అనే మేకను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఆరిఫ్ జావానీస్ దుస్తులు ధరించి కనిపించగా, మేకను శాలువాతో అలంకరించారు. సంప్రదాయ జావానీస్ దుస్తులు ధరించిన స్థానికుల బృందం పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అంతేకాదు వరుడు ఆడ మేకకు 22 వేల రూపాయలను కట్నంగా కూడా ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చాలా ఫన్నీ అంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆరిఫ్పై మండి పడుతున్నారు.

ఇదొక అసహ్యకరమైన కంటెంట్ అని, ఇలాంటి వాటివల్ల డబ్బు వస్తుంది కానీ, ప్రజలకు సమస్యలు వస్తాయని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. అలాగే "పెళ్లి చేసుకునే వారిని మాత్రమే నిందించకూడదు, ఇలాంటి పెళ్లికి మద్దతు ఇస్తున్న గ్రామ పెద్ద, చుట్టుపక్కల ప్రజలు వెర్రివాళ్లని నేను అనుకుంటున్నాను. వారు దానిని ప్రోత్సహించారు." అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇలా వింత కంటెంట్తో సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే ఫేమస్ ఇవ్వాలని ఆరిఫ్లా చాలా మంది విఫల ప్రయత్నాలు చేస్తున్నారు.