Begin typing your search above and press return to search.

నేటి నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!

By:  Tupaki Desk   |   14 April 2022 5:42 AM GMT
నేటి నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!
X
పెళ్లిళ్ల సీజన్ మొదలయిందండోయ్.. ఎక్కడ చూసిని పచ్చ తోరణాలు.. భాజా భజంత్రీల చప్పుళ్లే వినిపంచనున్నాయి. ఫంక్షన్ హాళ్లు, బట్టల షాపులన్నీ పెళ్లి షాపింగ్ లతో కళకళలాడిపోతున్నాయి. గత రెండేళ్లుగా పెళ్ళిళ్లన్నీ కరోనా కారణంగా తూతూ మంత్రంగానే చేసుకోవాల్సి వచ్చింది. కేవలం 10 నుంచి 20 మంది బంధువుల మధ్యే వివాహాలు చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కాస్త దూరం కావడంతో... పల్లెలు, పట్టణాలు, గ్రామాల్లో పరిణయ ఝురి పరిమళించబోతోంది.

ఈ సారి ఏప్రిల్ 13 నుంచి జూన్ 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో యువతీ యువకులు సంతేషపడుతున్నారు. ఇప్పటికే కొందరు పెళ్లి పత్రికలు ఆర్డర్లు ఇవ్వగా.. మరికొందరు పత్రికలు అచ్చు వేయించేందుకు పరుగులు తీస్తున్నారు. కల్యాణ మండపాలకు అడ్వాన్సులు ఇచ్చి మరీ ముందే బుక్ చేసేస్కుంటున్నారు. మంచి ముహూర్తం కోసం పురోహితులను కవడం వంటి ఏర్పాట్లు ముందు నుంచే ప్రారంబించేశారు.

మేమేం తక్కువా అంటూ మహిళలు బంగారు నగలు కొనేందుకు ఉత్సాహం చూపుతుండగా.. చీరల దుకాణాలు అయితే పెళ్లింటి వారితో కళకళలాడిపోతున్నాయి. ఇలా ఎవరి పనుల్లో వారు విపరీతమై బిజీగా ఉన్నారు. పెళ్లికి వెళ్లాలనుకునే వారు కూడా షాపింగులు చేస్తున్నారు. పెళ్లంటే మాచలు కాదు... ఖర్చులతో పాటు ఎన్నో బంధాలను దగ్గర చేసుకోవడం. పెళ్లంటే రెండు మనుసులతో పాటు రెండు కుటుంబాలు కలవడం. అయితే పెళ్లి చేసే వారికి ఇది ఖర్చుతో కూడుకున్నదే అయినా చాలా మందికి ఇది ఉపాధిని ఇస్తుంది.

పెళ్లంటే ముందుగా గుర్తొచ్చేవి పెళ్లి పత్రికలు, నూతన పట్టు చీరలు, వధూవరులు పరిణయ పట్టు వస్త్రాలు, ఫొటోలు వీడియోలు, ట్రావెల్స్ ఏజెంట్లు, పెళ్లి మండపాలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్చ్రీషియన్స్, బ్యాండ్ మేళం. ఒక పెళ్లి వల్ల ఇంత మందికి ఉపాధి దొరుకుతుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వీరంతా ఉపాధికి దూరం అయ్యారు. కానీ ఇప్పుడు మంచి రోజులు ఉండటం.. పెళ్లిళ్లు ఎక్కువగా జరగడం వంటివి వీరికి కలిసొస్తున్నాయి.

ఈ ఏడాది మూడు నెలల్లో వివాహాలు, శుభ కార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అయితే అవి ఎప్పుడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ ఏప్రిల్‌.. 13, 14, 15, 16, 17, 21, 22, 24, మే నెలలో.. 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25, జూన్‌ నెలలో ... 1, 3, 5 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఎక్కువగా పెళ్లిళ్లు జరగబోతున్నట్లు పురోహితులు చెబుతున్నారు.

ఈ మూడు నెలల్లో పెళ్లిళ్లు చేయాలనుకునే వారు ముందే జాగ్రత్త పడుతూ.. ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అనుకున్న సమయానికి ఫంక్షన్ హాళ్లు, అన్ని దొరకడం కుదరకపోవచ్చని వివరిస్తున్నారు.