Begin typing your search above and press return to search.

వీకెండ్స్ లాక్ డౌన్ ఎఫెక్ట్ .. ఖాళీగా దర్శనమిస్తున్న ముంబై !

By:  Tupaki Desk   |   10 April 2021 8:33 AM GMT
వీకెండ్స్ లాక్ డౌన్ ఎఫెక్ట్ .. ఖాళీగా దర్శనమిస్తున్న ముంబై !
X
మహారాష్ట్ర లో కరోనా కేసులు గతంలో కంటే వేగంగా సెకండ్ వేవ్ లో నమోదు అవుతున్నాయి. దీనితో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మహా ప్రభుత్వం వారాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధించింది. వీకెండ్ లాక్ డౌన్ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. అలాగే ప్రతిరోజు రాత్రివేళల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సెక్షన్ 144 విధించగా.. ఐదుగురు లేదా ఎక్కువ మంది కనిపించరాదు. ఈ కొత్త ఆంక్షలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి. వీకెండ్స్ లాక్ డౌన్ దెబ్బతో మెరైన్ డ్రైవ్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఉన్న వీధులు మరియు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ప్రధాన కార్యాలయం వరకు నగరంలోని అన్ని ప్రధాన రహదారులు పూర్తిగా ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా లాక్ డౌన్ కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇంటి నుండి బయటకి రావడం లేదు.

కరోనా పెరుగుతున్న సమయంలో పాక్షిక లాక్ ‌డౌన్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 58, 993 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 32,88,540 కు చేరుకున్నాయి. నిన్న 301 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 57,329 కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు అత్యధిక మరణాలు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ రోజు 26,95,148 మంది రోగులు కోలుకోవడంతో మహారాష్ట్రలో మొత్తం క్రియాశీల COVID-19 కేసులు 5,34,603కు తగ్గాయి. రాష్ట్ర రికవరీ రేటు ప్రస్తుతం 82.36 శాతంగా ఉంది. పూణే, ముంబై, నాగ్‌పూర్, థానే, ఔరంగాబాద్‌లలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరణాల రేటు 1.79 శాతంగా ఉంది. కరోనా టీకాల కొరతతో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలు మూతపడుతుండగా.. మరికొన్ని చోట్ల ఆస్పత్రుల్లో పడకల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు