Begin typing your search above and press return to search.

‘‘3’’ తర్వాత ‘‘16’’ సున్నాలు పెడితే..

By:  Tupaki Desk   |   1 Dec 2016 7:30 PM GMT
‘‘3’’ తర్వాత ‘‘16’’ సున్నాలు పెడితే..
X
ఇదే మాటను మిమ్మల్ని ఎవరైనా అడిగి.. ఆ మొత్తం ఎంత అవుతుందో చెప్పాలని అడిగితే? వెంటనే సమాధానం చెప్పటం చాలా కష్టం. అంతదాకా ఎందుకు.. ‘‘16’’ సున్నాల్ని మొదటిసారే విజయవంతంగా పూర్తి చేయమని చెప్పినా సాధ్యం కాదనే చెబుతారు. ఇంతకీ మూడు అంకె తర్వాత 16 సున్నాలు పెడితే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానంతో పాటు.. ఇదంతా ఎందుకన్న మాటను అడిగితే మీరు ఊహించలేని సమాధానం రావటం ఖాయమని చెప్పాలి.

ఎవరినైనా మీ వెయిట్ ఎంత అంటే చెప్పేస్తారు. ఇంట్లో మీకుఅత్యంత సన్నిహితులైన వారి వెయిట్ అడిగితే కాస్త ఆలోచిస్తారు. అదే.. భూమి మీద ఉన్న సమస్త నిర్మాణాల బరువు ఎంత అని అడిగితే సమాధానం చెప్పటం సాధ్యమే కాదు. కానీ.. ఇలాంటి సందేహమే వచ్చిన బ్రిటన్ లోని లీసెష్టర్ యూనివర్సిటీ పరిశోధక బృందం దీని లెక్క తేల్చేందుకు భారీ కసరత్తునే చేసింది.చివరకు..ఆ బృందం లెక్క కట్టి తేల్చిందే.. మూడు పక్కన 16 సున్నాలు. ఈ మొత్తాన్ని విలువ రూపంలో చెబితే.. 30 ట్రిలియన్లుగా చెప్పొచ్చు. ఇంకా వివరంగా అర్థం కావాలంటే మాత్రం.. మన పరిభాషలో 20 లక్షల కోట్లుగా చెప్పాల్సి ఉంటుంది.

ఈ మొత్తం బరువు.. భూమి మీద ఉన్న సమస్త నిర్మాణాల (అదేనండి కట్టడాల) బరువుగా చెప్పొచ్చు. ఇళ్లు.. ఫ్యాక్టరీలు.. ఇతర నిర్మాణాలతో పాటు.. పొలాలు.. కంప్యూటర్లు.. స్మార్ట్ ఫోన్లు.. సీడీలు.. చెత్తాచెదారంఅన్నింటిని లెక్కలోకి తీసుకుంటే ఈ భారీ మొత్తం వస్తుందని తేల్చారు. ఇక.. భూమి మీదున్నప్రతి చదరపు మీటర్ కు ఎంత బరువు ఉంటుందన్న లెక్కను కూడా తేల్చేశారు. ఇదైతే.. సుమారు 50 కేజీల వరకూ ఉంటుందని తేల్చారు. వింటుంటే.. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/