Begin typing your search above and press return to search.

ఫ్రెండ్స్ తో న్యూఇయర్ పార్టీకి హోటల్ కు వెళ్లింది.. బాత్ టబ్ లో శవమైంది

By:  Tupaki Desk   |   5 Jan 2021 10:06 AM GMT
ఫ్రెండ్స్ తో న్యూఇయర్ పార్టీకి హోటల్ కు వెళ్లింది.. బాత్ టబ్ లో శవమైంది
X
చూసేందుకు మోడల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఎయిర్ హోస్టెస్ పది మంది స్నేహితులతో కలిసి న్యూఇయర్ పార్టీకి వెళ్లింది. అనంతరం హోటల్ లో స్నేహితులతో స్టే చేసిన ఆమె.. శవమై తేలటం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమెను గ్యాంగ్ రేప్ చేసి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఫిలిఫిన్స్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తుంటుంది క్రిస్టిన్ ఏంజెలికా డాసెరా అనే మహిళ.

కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ చేసుకునేందుకు మకటి సిటీలోని సిటీ గార్డెన్ హోటల్ కు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె కోలీగ్స్ కూడా ఉన్నారు. పార్టీ పూర్తైన తర్వాత హోటల్ లోనే ఉండిపోయింది క్రిస్టిన్. ఆమెతో పాటు ఆమె సహచరి ఉద్యోగి రోమెల్ కూడా ఉన్నాడు. ఉదయం పది గంటల సమయంలో లేచే సమయానికి బాత్ టబ్ లో ఉండటం.. నిద్రపోతుందన్న ఉద్దేశంతో బ్లాంకెట్ కప్పి మళ్లీ నిద్రపోయినట్లు చెబుతున్నాడు. కాసేపటికి మళ్లీ నిద్ర లేచేసరికి.. క్రిస్టిన్ టబ్ లోనే ఉందని.. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన ఆమెను తీసుకొని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు తేల్చారు. ఆమె ఒంటి మీద గాయాలు ఉండటంతో అత్యాచారానికి గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. క్రిస్టిన్ జనవరి 1న సాయంత్రం ఐదు గంటలకు మరణించి ఉంటుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ మరణానికి కారణం ఏమిటన్న విషయంపై మరింత సమాచారం బయటకు వస్తుందని చెబుతున్నారు. ఆమె మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారెవరన్నదిపోలీసుల విచారణలో తేలనుంది.