Begin typing your search above and press return to search.

రస‘గోల‘

By:  Tupaki Desk   |   10 Sep 2015 7:17 AM GMT
రస‘గోల‘
X
రసగుల్లా అంటే ఇష్టంలేనివారు ఉండరేమో... నోరూరించే ఈ తీపి వంటకం పేరు చెబితే చాలు బెంగాలీ స్వీటు అని చాలామంది అనకుంటారు. కానీ అదేసమయంలో ఇది ఒడిశా రాష్ట్రంలో పుట్టిన మిఠాయి అన్న వాదనా చాలాకాలంగా ఉంది. అయితే... ఇంతవరకు దీనిపై ప్రజల్లో చర్చే జరిగింది కానీ వివాదం స్థాయికి ఎన్నడూ చేరలేదు. కానీ... ఒడిశా దీనికి పేటెంట్ సంపాదించేందుకు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది. అది తమ వంటకమని దానికి పేటెంటు తమకే ఇవ్వాలని బెంగాల్ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.

దేనికైనా బాగా పేరొస్తే అది ఫలానా ప్రాంతానికి చెందినదని నిరూపించుకోవాలంటే ప్రపంచ వాణిజ్య సంస్థల నిబంధనల ప్రకారం మేథోహక్కుల కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనుమతులు తీసుకోవాలి... ఇప్పుడు ఈ హక్కుల కోసమే ఒడిశా, బెంగాల్ లు పోటీపడుతున్నాయి. దీనికోసం రెండు రాష్ట్రాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో 12వ శతాబ్దంలోనే రసగుల్లా ప్రసాదంగా ఉండేదని ఒడిశా వాదిస్తోంది.

భువనేశ్వర్, కటక్ ల మధ్య ఉన్న పహలా అనే ఊరు రసగొల్లా కు జన్మస్థానం అని చెబుతుంటారు... ఒడిశా జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కావాలని దరఖాస్తు చేసింది కూడా ఈ ఊరి రసగుల్లాకే. ఇక్కడ పుట్టిన రసగుల్లా తరువాత ఖీర్ మోహన పేరుతో జగన్నాథ ఆలయంలో ప్రసాదంగా మారిందని చెబుతుంటారు. ఇప్పటికీ పహలా రసగుల్లాకు చాలా ఫేమస్ దేశవ్యాప్తంగా ఫేమస్ ... నేషనల్ హైవేపై వెళ్లేవారు పహలాలో రసగుల్లా కొనకుండా వెళ్లరు. అయితే బెంగాల్ కు చెందిన నబీన్ దాస్ రసగుల్లాను కనుగొన్నారని బెంగాల్ వాదిస్తోంది. కానీ... రెండు న్యూట్రల్ గా ఉన్న పరిశోధకులు మాత్రం నబీన్ దాస్ కంటే ముందే ఒడిశాలోని పహలాలో రసగుల్లా ఉందని చెబుతున్నారు. మరి గుర్తింపు ఎవరకు దక్కుతుందో చూడాలి.