Begin typing your search above and press return to search.
మమత యూ టర్న్ తీసుకున్నారా ?
By: Tupaki Desk | 6 Aug 2022 7:51 AM GMTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారా ? ఇపుడిదే అనుమానం అందరిలోను పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీలో నరేంద్ర మోడీతో మమత భేటీ అయ్యారు. మోడీ-మమత మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే.
మమతను ఇబ్బందులు పెట్టడానికి మోడీ శతవిధాల ప్రయత్నించారు. మొన్నటి ఎన్నికల్లో మమతను ఎలాగైనా ఓడించేందుకు వీలైనంతమంది తృణమూల్ మంత్రులు, ఎంఎల్ఏలను బీజేపీ లాగేసుకున్న విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు తృణమూల్ కు చెందిన సుమారు మంత్రులు, ఎంఎల్ఏలు 30 మందిని లాగేసుకున్నది బీజేపీ. అవకాశముంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలని కూడా ప్రయత్నాలు జరిగింది. అయితే ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాన్ని కూల్చలేకపోవటంతో పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో మమత బంపర్ మెజారిటితో గెలిచారు.
దాంతో రూటుమార్చిన బీజేపీ గవర్నర్ ను అడ్డంపెట్టుకుని నానా రచ్చ చేసింది. దీదీ కూడా మోడీ ప్రయత్నాలను అంతే ధీటుగా ఎదుర్కొన్నారు. దాంతో మోడీ-మమత మధ్య ఒక రేంజిలో రాజకీయ యుద్ధం జరిగింది.
అలాంటిది ఇపుడు హఠాత్తుగా ఢిల్లీలో మోడీని మమత కలవటం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బద్ధశతృవైన జగదీప్ ధనకర్ గెలుపు కోసం ఏకంగా ఓటింగునే బహిష్కరించినట్లు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన మమత తాజాగా మోడీతో భేటీ అవటమే విచిత్రంగా ఉంది. ఇప్పటివరకు నాన్ ఎన్డీయే పార్టీలతో కలిసున్న దీదీ మెల్లిగా అందరికీ దూరమవుతున్నట్లే ఉన్నారు.
మమత తీరు చూస్తుంటే మోడీకి తెల్లజెండాను చూపించి ఎన్డీయేలో కలిసిపోతారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మోడీని వ్యతిరేకించినా చేయగలిగేదేమీ లేదన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయినట్లుంది. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవటం సాధ్యంకాదు. అయితే ఆ కాంగ్రెస్ తో కలిసిపనిచేయటం మమతకు ఇష్టంలేదు. ఇంక మోడీని ఎదుర్కోవటం ఎలాగ ? ఒంటరిగా ఎదుర్కోలేరు నలుగురితో కలవటమూ ఇష్టంలేదు. అందుకనే మోడీతోనే చేతులు కలిపితే కనీసం రాష్ట్రప్రయోజనాలన్నా నెరవేరుతాయని అనుకున్నట్లున్నారు. మరి చూడాలి చివరకు ఏమవుతుందో.