Begin typing your search above and press return to search.
మమతను మిస్ గైడ్ చేసినోళ్లు ఎవరు? తమ్ముళ్ల ఆరా ఇదే
By: Tupaki Desk | 18 March 2022 11:52 AM GMTఅంతర్జాతీయంగా.. జాతీయంగా పెను దుమారాన్ని రేపిన పెగాసన్ సాఫ్ట్ వేర్ ఇష్యూ.. అనూహ్యంగా మళ్లీ తెర మీదకు రావటం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పెగాసన్ సాఫ్ట్ వేర్ వాడాలని కోరుతూ కొందరు తనను సంప్రదించినట్లుగా పేర్కొని షాకిచ్చారు. అంతేకాదు.. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పెగాసన్ సాఫ్ట్ వేర్ ను వినియోగించారంటూ ఆమె పెద్ద బాంబ్ పేల్చారు.
అయితే.. అందులో నిజం లేదని.. బాబు తనయుడు లోకేశ్ స్పష్టం చేయటంతో పాటు.. తాము పెగాసన్ సాఫ్ట్ వేర్ వినియోగించి ఉంటే.. జగన్ ప్రభుత్వం తమ మీద చర్యలు తీసుకోకుండా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇలాంటి వాటికి సరైన రీతిలో సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండే టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ట్విటర్ లో ట్వీట్లు చేస్తూ.. చంద్రబాబు మీద మమతమ్మ వేసిన పెగాసన్ మరకను తుడిచేసే అస్త్రాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. చంద్రబాబు సర్కారు పెగాసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదన్న విషయాన్ని స్వయంగా మీ సవాంగన్నే చెప్పారన్న విషయాన్ని వెల్లడించారు అయ్యన్న.
గత ఏడాది జులైలో కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సమాచార హక్కు చట్టం కింద.. చంద్రబాబు ప్రభుత్వం పెగాసన్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారా? అన్న ప్రశ్నను సంధించారు. దీనికి గత ఆగస్టు 12న గౌతమ్ సవాంగ్ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
అందుకు సంబంధించిన పత్రాల్ని ట్వీట్ లో పోస్టు చేసిన ఆయన.. 'తాను.. తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని స్వయంగా జగన్ బయటపెట్టటమే దేవుడి స్క్రిప్టు' అని పేర్కొన్నారు. మమత వేసిన పెగాసన్ మరకకు గతంలోనే గౌతమ్ సవాంగ్ క్లీన్ చిట్ ఇవ్వటం దేవుడి స్క్రిప్టు కాక మరేంటి?