Begin typing your search above and press return to search.
కర్ణాటకలో తానేంటో శాంపిల్ చూపిన దీదీ!
By: Tupaki Desk | 24 May 2018 4:08 AM GMTసింఫుల్ గా కనిపిస్తారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అలియాస్ దీదీ. హవాయి చెప్పులు.. ముతక చీర కట్టులో పక్కింటి బామ్మకు కుడి ఎడమగా కనిపించే ఆమె.. మామూలుగా ఉంటే ఫర్లేదు కానీ.. ఆగ్రహం వచ్చిందంటే ఆపటం ఎవరి వల్లా కాదు. ఆ విషయాన్ని తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం స్పష్టం చేసింది.
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే వేళ.. పశ్చిమబెంగాల్ నుంచి వీలు చేసుకొని మరీ వచ్చిన దీదీతో.. వేదిక మరింత శోభను సంతరించుకుందని చెప్పక తప్పదు. కుమారస్వామి ప్రమాణానికి సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ లాంటోళ్లు వచ్చినా... దీదీ రావటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి కారణం లేకపోలేదు.
ఒక పెద్ద రాష్ట్రానికి తిరుగులేని నేతగా వ్యవహరిస్తూ ఉండటం.. సమీప భవిష్యత్తులో సైతం మరో రాజకీయ పార్టీకి అవకాశం లేకపోవటం కారణంగా చెప్పాలి. నాన్ స్టాప్ గా అధికారాన్ని కొనసాగిస్తున్న ఆమె.. తన పాలనకు బెంగాలీ ప్రజలు ఎంతలా ఫిదా అయ్యారన్న విషయాన్ని ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి.
అధికార పార్టీకి సమీపంలోకి కూడా విపక్షాలు రాకపోవటం చూస్తే.. బెంగాల్‌లో దీదీ పవరేంటో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి ఆమె.. కర్ణాటకలో తానేంటో అర్థమయ్యేలా చేసి.. పలువురికి షాకిచ్చారు. ఒక ఊరి ప్రెసిడెంట్.. పక్క ఊరుకు వెళితే పాలేరన్నట్లుగా నానుడి ఉంటుంది. కానీ.. ఈ సామెత మమతకు మినహాయింపుగా చెప్పాలి.
కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కర్ణాటకకు వచ్చిన ఆమె.. బెంగళూరు మహానగర ఎయిర్ పోర్ట్ నుంచి ప్రమాణస్వీకారోత్సవానికి రావటానికి ఇబ్బందికి గురయ్యారట. పెద్ద ఎత్తున వీవీఐపీలు రావటంతో పలుచోట్ల ట్రాఫిక్ జాంలు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా రోజు మాదిరే ప్రజలే కాదు.. ప్రముఖులు కూడా ఇబ్బందులకు గురయ్యారు. అలాంటివారిలో దీదీ కూడా ఒకరు.
రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చిన వేళ.. ఇలాంటివి ఎదురైతే మౌనంగా భరిస్తుంటారు సాధారణంగా. కానీ.. దీదీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రమాణస్వీకారోత్సవ వేదిక మీద కనిపించిన కర్ణాటక రాష్ట్ర డీజీపీ నీలమణి రాజుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం షాకింగ్ గా మారింది.
ట్రాఫిక్ కంట్రోల్ చేసే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించిన దీదీ దెబ్బకు సదరు డీజీపీ సారు వారి నోటి వెంట మాట రాలేదట. డీజీపీ స్థాయి అధికారిని చెడామడా కడిగేసినట్లుగా మాట్లాడిన దీదీ రూపంతో.. వేదిక మీద ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ.. ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం కూసింత షాక్ కు గురయ్యారట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.