Begin typing your search above and press return to search.
మీడియాను కలవని మోడీ.. ఆ పత్రికకు ఆర్టికల్ రాశారు
By: Tupaki Desk | 26 March 2021 8:21 AM GMTఏలాంటి ప్రజాదరణ లేని ఒక నేత భారత్ లాంటి దేశాన్ని పదేళ్ల పాటు పాలించగలరా? తనకు తానుగా సొంతంగా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి గెలవలేని వ్యక్తి.. పదేళ్లు పీఎం పోస్టులో కూర్చోవటం భారత్ కు మాత్రమే సాధ్యమయ్యే పని. అది కూడా మన్మోహన్ సింగ్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో? ఆయన హయాంలో ఏడాదికో.. రెండేళ్లకో ఒకసారి మీడియాతో భేటీ అయ్యేవారు. ఈ తీరుపై అప్పట్లో విమర్శలు వినిపించేవి.
అంతకు ముందు ప్రధాన మంత్రిగా పని చేసిన వారు మీడియా అధినేతలతోనూ.. సీనియర్ రిపోర్టర్లతో అప్పుడప్పుడు మాట్లాడేవారు. పాలన మీద వారి ఫీడ్ బ్యాక్ తీసుకునే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. మోడీ లాంటి జనాకర్షక నేత మీడియాను అస్సలు దగ్గరకురానివ్వరన్న పేరుంది. అవసరమైతే.. మీడియా అధినేతలతోనే ఆయన మాట్లాడతారు. వారికి సలహాలు.. సూచనలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మీడియాతో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించని మోడీ.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన ‘‘ది డెయిలీ స్టార్’’ లో ప్రత్యేకంగా ఆర్టికల్ రాసిన వైనం ఆసక్తికరమని చెప్పాలి. తాజాగా బంగ్లాదేశ్ పర్యటన కు వెళ్లిన ఆయన.. ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్నారు. ఆ దేశంలో తన పర్యటన ప్రారంభం కావటానికి ముందే.. తాను రాసిన ఆర్టికల్ ను పబ్లిష్ అయ్యేలా చూసుకున్నారు.
‘ఇమేజింగ్ ఏ డిఫరెంట్ సౌత్ ఆసియా విత్ బంగబంధు’ పేరుతో రాసిన ఆర్టికల్ లో.. ఆ దేశ తొలి అధ్యక్షుడు బంగబంధు షేర్ ముజిబుర్ రెహ్మాన్ చేసిన కృషిని ప్రస్తుతించారు. ఆయన బతికి ఉన్నట్లైయితే బంగ్లాదేశ్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ‘ఆయన హత్యకు గురి కాకపోతే మన ఉపఖండం మరోలా ఉండేది. ఆయన మరణం మన ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా రెహ్మాన్ తన పోరాటానికి కట్టుబడి ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇంతకూ ఆయన ఆర్టికల్ రాయాల్సిన అవసరం ఏమిటి? మీడియా ప్రతినిధులతో కలవని ఆయన ఏకంగా ఆర్టికల్ రాసేయటమా? అంటే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలే దీనికి కారణంగా చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ మీద మోడీషాలు ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యంలోనే బంగ్లా పర్యటనను ప్లాన్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. తాను ఏ దేశంలో పర్యటిస్తున్నా.. ఆ దేశ ప్రజల చూపు తన మీద పడేలా చేయటంలో మోడీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తుంటారు. అందులో భాగంగానే ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థలో ఆర్టికల్ రాయటం ద్వారా బంగ్లాదేశ్ ప్రజలే కాదు.. బెంగాలీల మనసుల్ని దోచుకోవాలన్న వ్యూహం ఉందంటున్నారు.