Begin typing your search above and press return to search.

స్కూటర్ లో ఈవీఎంలు .. ఎక్కడ , ఎలా వచ్చాయంటే ?

By:  Tupaki Desk   |   7 April 2021 6:53 AM GMT
స్కూటర్ లో ఈవీఎంలు .. ఎక్కడ , ఎలా వచ్చాయంటే ?
X
దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడు , కేరళ , పుదుచ్చేరి , అస్సాం , బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి. ఒక్క బెంగాల్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. బెంగాల్ లో 8 దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 3 దశలలో ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు , కేరళ , పుదుచ్చేరి ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు తప్పితే ఎక్కడ కూడా పెద్దగా ఘర్షలు జరగలేదు.

ఇక ఎన్నికల అధికారుల అక్కడక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈవీఎంలను దొంగలు ఎతుకుపోతున్న సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎన్నికల అధికారులు గాని కనిపెట్టలేకపోయారు. చెన్నైలోని వెలాచేరీ ప్రాంతం ఇద్దరు వ్యక్తులు రెండు ఈవీఎంలను చోరీ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ ఈవీఎంలు రిజర్వ్ యూనిట్ ‌లని ఎన్నికల అధికారులు తెలిపారు. అయినప్పటికి కూడా కూడా ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే .. పశ్చిమ బెంగాల్ లో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఎన్నికల అధికారి ఈవీఎంలు వీవీ ఫ్యాట్స్ తీసుకోని టీఎంసీ నేత ఇంటికి వెళ్ళాడు. ఆయన వెంట సెక్యూరిటీని కూడా తీసుకెళ్లారు. తృణమూల్ నేత గౌతమ్ ఘోష్, తపన్ సర్కార్ కు బంధువు కావడంతో వారి ఇంట్లో రాత్రి నిద్రించేందుకు వచ్చారు. అయితే తనతోపాటు నాలుగు ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు తీసుకెళ్లాడు. ఇది చట్ట రీత్యా నేరం.. ఈవీఎం, వీవీ ఫ్యాట్స్ ను ఎన్నికల అధికారులు కేటాయించిన స్టోర్ రూమ్స్ లో భద్రపరచాలి. కానీ తపన్ వాటిని రాజకీయ నాయకుడి ఇంటికి తీసుకెళ్లారు. ఇది చట్టరీత్య నేరం కావడంతో సెక్టార్ ఆఫీసర్‌ తపన్ సర్కార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అతడితోపాటు సెక్యూరిటీగా వెళ్లిన వారిని కూడా సస్పెండ్ చెయ్యాలని ఆదేశించారు. వీరికి జరిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది.