Begin typing your search above and press return to search.

బెంగాల్ లో పోటెత్తిన ఓటర్లు.. గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   12 April 2021 4:21 AM GMT
బెంగాల్ లో పోటెత్తిన ఓటర్లు.. గెలుపెవరిది?
X
అనుకున్నది ఒక్కటి అవుతోంది ఒక్కటి.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య టగ్ ఆఫ్ పైర్ నడుస్తోంది. ఇటీవల దాడులు, కాల్పులకు కూడా దారితీసింది.

బెంగాల్ లో ఇంత ఉద్రిక్తతల మధ్య భారీ పోలింగ్ శాతం నమోదు కావడం చర్చనీయాంశమైంది. తొలి దశలో బెంగాల్ లో ఏకంగా 84.13 శాతం, రెండో దశలో పోలింగ్ 86.11శాతం, మూడో దశ పోలింగ్ లో 84.61శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

ఇక ఇటీవలే ముగిసిన నాలుగో దశలో ఏకంగా 79.90 శాతం పోలింగ్ నమోదు కావడంతో మిగతా దశల పోలింగ్ లు కూడా ఓటర్లు పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం బెంగాల్ లో బీజేపీ-టీఎంసీల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. బెంగాల్ లో అధికారం సాధించడమే లక్ష్యంగా ఇరు పక్షాలు పోరాడుతున్నాయి. మోడీ, అమిత్ షా బెంగాల్ ను చుట్టేస్తుండగా.. మమతా బెనర్జీ టీఎంసీ తరుఫున ఒక్కరై పోరాడుతున్నారు.

సాధారణంగా ఎన్నికల్లో అధిక పోలింగ్ శాతం నమోదు అవుతుంటే అది ప్రభుత్వవ్యతిరేకతకు నిదర్శనంగా విశ్లేషకులు చెబుతారు. మరి ఇది బెంగాల్ సీఎం మమతా కొంపు ముంచుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బెంగాల్ లో ఏకంగా సగటున 82శాతం పోలింగ్ నమోదు కావడం.. 75శాతానికి తగ్గకపోవడంతో ఇదే ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆందోళనకు గురిచేస్తోంది. పలు దశల్లో ఏకంగా వందకు వంద మంది ఓటు వేయడం సంచలనమైంది.

అయితే బెంగాల్ లో టీఎంసీ, బీజేపీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని.. ఓటర్లను దగ్గరుండి వేయిస్తున్నాయని.. అదే ఓటు హక్కు పెరగడానికి కారనమనే వాదన వినిపిస్తోంది.