Begin typing your search above and press return to search.

బీజేపీ కరోనా రాజకీయం మామూలుగా లేదుగా !

By:  Tupaki Desk   |   24 April 2021 6:30 AM GMT
బీజేపీ కరోనా రాజకీయం మామూలుగా లేదుగా !
X
అధికారంలోకి రావటానికి బీజేపీ ఏ ఒక్క అవకావాన్ని వదులుకునేట్లు లేదు. అందుకనే పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో చవకబారు రాజకీయానికి తెరలేపింది. తమను గనుక ప్రస్తుత ఎన్నికల్లో గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా వేయిస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్ బీజేపీ అధికారిక ట్విట్టర్ లో వచ్చిన ట్వీట్ తో యావత్ జనాలందరు మండిపోతున్నారు. కరోనా వైరస్ సమయంలో కూడా బీజేపీకి చీపు రాజకీయాల ముఖ్యమా అంటు నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.

ఎలాగైనా సరే బెంగాల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ గా నరేంద్రమోడి, అమిత్ షా నానా అవస్తలు పడుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఎంత వీలైంత అంతా మమతాబెనర్జీని కట్టడి చేస్తున్నారు. అయినా అధికారంలోకి వచ్చే విషయంలో అనుమానులున్నాయి. అందుకనే తాజాగా బెంగాల్ బీజేపీ ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టింది. తమకు ఓట్లేసి గెలిపిస్తే జనాలందరికీ వ్యాక్సినేషన్ ఫ్రీ అని. ఇదే విషయమై గతంలోనే మమత మాట్లాడుతు వ్యాక్సిన్ను జనాలందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

8 దశల పోలింగ్ లో ఇప్పటికే 6 దశలు అయిపోయాయి. ఇంకా రెండుదశల పోలింగ్ పెండింగ్ లో ఉంది. పోలింగ్ ఎన్నిదశల్లో జరుగుతున్నా కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకం నూరుశాతం కమలనాదుల్లో కనబడటంలేదు. అందుకనే తాజాగా ఫ్రీ వ్యాక్సినేషన్ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి అధికారంతో సంబంధం లేకుండా జనాలందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ వేయాలంటూ జనాలు నరేంద్రమోడిని డిమాండ్ చేస్తున్నారు. ట్వీట్ ప్రకారం బెంగాల్లో అధికారంలోకి రాకపోతే జనాలకు ఉచిత వ్యాక్సిన్ లేనట్లే.

బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో తప్పుడు హామీలే ఇస్తుంటుందనే విషయం గతంలోనే రుజువైంది. గతంలో బీహార్ ఎన్నికల్లో గెలిపిప్తే లక్షల కోట్లతో ప్యాకేజీ అని స్వయంగా మోడినే ప్రకటించారు. అయితే మోడి హామీని నమ్మని జనాలు బీజేపీని గెలిపించలేదు. దాంతో ప్యాకేజీ అటకెక్కింది. ఇపుడు పాండిచ్చేరికి ప్రత్యేకహోదా అంటూ మరో హామీని వదిలారు. ఒకవేళ పాండిచ్చేరిలో గెలిచినా ప్రత్యేకహోదా ఇచ్చేది అనుమానమే. ఎందుకంటే హామీని నిలుపుకునే ట్రాక్ రికార్డు బీజేపీకి లేదుకాబట్టే.