Begin typing your search above and press return to search.

ఆ మాజీ విండీస్ క్రికెటర్ 650 మందితో రొమాన్స్

By:  Tupaki Desk   |   22 April 2016 4:49 AM GMT
ఆ మాజీ విండీస్ క్రికెటర్ 650 మందితో రొమాన్స్
X
క్రికెటర్లు.. సినిమా సెలబ్రిటీలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. అయితే.. సన్నిహిత సంబందాల గురించి మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే అలాంటివన్నీ ఆరోపణలుగా కొట్టిపారేయటం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నమైన వ్యవహారం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. తనకు సంబంధించిన రాసలీలల్ని ఒక మాజీ క్రికెటర్ ఓపెన్ గా చెప్పేసి షాక్ కు గురి చేశారు.

ప్రపంచ క్రికెట్లో ఫాసెస్ట్ బౌలర్లలో ఒకరిగా చెప్పుకునే వెస్టిండీస్ మాజీ బౌలర్ టినో టెస్ట్ చెబుతున్న మాటలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. తాజాగా అతగాడు తన జీవిత కథను పుస్తకంగా రాశాడు. అందులో మహిళలతో తనకున్న సంబంధాల గురించి రాసుకొచ్చారు. కెరీర్ గురించి ఎలా అయితే అంకెలతో గొప్పగా చెప్పుకుంటారో తన రాసలీలల గురించి అంతే గొప్పగా కీర్తించుకున్నాడు. పదేళ్ల టెస్ట్ కెరీర్ లో 25 టెస్ట్ లు.. 26 వన్డేలలో కలిపి మొత్తంగా 91 వికెట్లు పడగొట్టిన టినోను అందరూ ఎక్కువగా గుర్తు పెట్టుకునే మ్యాచ్ ఇంగ్లండ్ జరిగిందే. 2012లో జరిగిన ఈ మ్యాచ్ లో పదకొండో ఆటగాడిగా క్రీజ్ లోకి వచ్చి ఏకంగా 95 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

బౌలర్ గానే కాక బ్యాట్స్ మెన్ గా అప్పుడప్పుడు మెరుపులు సృష్టించిన ఇతగాడు.. నిజ జీవితంలో తానో తిరుగులేని బ్యాట్స్ మన్ అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశాడు. తనకు తాను పురుష వ్యభిచారిగా చెప్పిన టినో.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటివరకూ వివిధ దేశాలకు చెందిన 650 మంది అమ్మాయిలతో సెక్స్ చేసినట్లుగా ప్రకటించాడు. తాను అమ్మాయిల్ని విపరీతంగా ఇష్టపడతానని.. అదే విధంగా తనను వాళ్లు కూడా అంతే ఇష్టపడతారని చెప్పాడు.

జట్టు లోనే అందగాడిగా తనను తాను కీర్తించుకునే టినో.. తనను బ్లాక్ బ్రాడ్ పిట్ గా పిలవొచ్చని చెప్పుకోవటం గమనార్హం. 2005లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక్క మ్యాచ్ ఆడకున్నా.. మూడు నెలల వ్యవధిలో 40 మంది అమ్మాయిల్ని తన రూమ్ కి తీసుకురాగలిగానని.. తన జట్టులో తనదే రికార్డుగా గొప్పలు పోయాడు. బెడ్రూంలోనే ఎంత బిజీగా ఉన్నా గ్రౌండ్ లో ప్రాక్టీస్ ను తానెప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని చెప్పుకున్నాడు. క్రికెటర్ గా తాను ఏ దేశానికి వెళ్లినా అమ్మాయిలతో మాటలు కలిపి వారిని బెడ్రూం వరకూ తెచ్చుకునే వాడినని గొప్పలు చెప్పుకొచ్చాడు.