Begin typing your search above and press return to search.
రెండో రోజూ సంచలనం.. టి20 ప్రపంచ కప్ లో విండీస్ ఓటమి
By: Tupaki Desk | 17 Oct 2022 10:35 AM GMTక్రికెట్ లో అనూహ్య ఫలితాలకు మారు పేరైనా టి20 ఫార్మాట్లో వరుసగా రెండో రోజూ సంచలనం నమోదైంది. తొలి రోజు ఆదివారం మాజీ చాంపియన్, ఇటీవలి ఆసియా కప్ విజేత శ్రీలంకకు నమీబియా షాకివ్వగా.. రెండో రోజు సోమవారం టి20 ప్రపంచ కప్ మాజీ చాంపియన్ వెస్టిండీస్ ను స్కాట్లాండ్ మట్టికరిపిచింది. అలా మరో సంచలనం నమోదైంది. అర్హత మ్యాచ్ లుగా పిలుస్తున్న ఈ రౌండ్ లో విండీస్, లంక ఓటములు ఆ జట్లు మెయిన్ సూపర్ -12కు క్వాలిఫై అయ్యే అవకాశాన్ని సంక్లిష్టం చేయనున్నాయి. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ ఈ జట్లు గెలవాల్సిన పరిస్థితి. అలాగైతేనే సూపర్ 12కు వెళ్తాయి.
వెస్టిండీస్ కు షాక్ ఇలా..
విండీస్ అంటేనే హార్డ్ హిట్టర్లు. ఒకే ఓవర్లో అది కూడా చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టి కప్ ఎగురేసుకుపోయిన చరిత్ర వారి సొంతం. టి20 కప్ ను రెండు సార్లు గెల్చుకున్న ఘనత వారి సొంతం. అలాంటి వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ ఓడించి మరో సంచలనం సృష్టించింది. తొలుత స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మున్సే (66) అర్ధశతక సాధించాడు. మైకెల్ జోన్స్ (20) మ్యాక్‌లియోడ్ (23) ఫర్వాలేదనిపించారు.
ఛేదనలో స్కాట్లాండ్ బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ 118 పరుగులకే కుప్పకూలింది. ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ (38) టాప్ స్కోరర్. కేల్ మయేర్స్ (20) కొన్ని పరుగులు చేశాడు. పదేళ్ల తర్వాత టి20 కప్ ఆడుతున్న ఎవిన్ లూయిస్ 14, బ్రాండన్ కింగ్ 17, పూరన్ 4, బ్రూక్స్ 4, రోవ్‌మన్ పావెల్ 5, ఒడియన్ స్మిత్ 5 పరుగులు మాత్రమే చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 3, వీల్ 2, లీస్క్ 2.. జోష్, షరిఫ్ చెరో వికెట్ తీశారు.
నిన్న శ్రీలంకకు..
నమీబియాపై నిన్నటి మ్యాచ్ లోనూ శ్రీలంకకు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. లంక గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా! కానీ ఆ జట్టు ఏకంగా 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలా టి20 ప్రపంచకప్ తొలి రౌండ్ సంచలన ఫలితంతో మొదలైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జాన్ ఫ్రైలింక్ (44; 28 బంతుల్లో 4x4.. 2/26) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నమీబియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటర్లంతా ఘోరంగా విఫలమవడంతో శ్రీలంకకు పరాభవం తప్పలేదు. ఆ జట్టు 19 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ దసున్ శానక (29; 23 బంతుల్లో 2x4, 1x6) టాప్‌స్కోరర్. ఈ పరాజయంతో శ్రీలంక సూపర్-12 అవకాశాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
భారీ తేడాతో ఓడటం నెట్ రన్‌రేట్‌పైనా తీవ్ర ప్రభావం చూపనుంది. నెదర్లాండ్స్, యూఏఈ కూడా ఉన్న గ్రూప్-ఎ నుంచి సూపర్ 12కు అర్హత సాధించాలంటే శ్రీలంక తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. అయినా మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై శ్రీలంక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి గ్రూప్ నుంచి నమీబియా రేసులో ముందుంది. కాగా, మొదట్లో నమీబియాను కట్టడి చేసిన లంక బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో చేతులెత్తేశారు. తీక్షణ (1/23), చమీర (1/39), లియనాగమాగె (2/37), కరుణరత్నె (1/36), హసరంగ (1/27) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు స్కోరు 95/6 మాత్రమే.
అయితే ఆఖరి 5 ఓవర్లలో నమీబియా 68 పరుగులు రాబట్టింది. ఫ్రైలింక్, జేజే స్మిట్ (31 నాటౌట్;16 బంతుల్లో 2x4, 2x6) ఏడో వికెట్‌కు 70 పరుగుల జోడించి జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించారు. చివరి 5 ఓవర్లలో గాడితప్పిన లంక.. బ్యాటిగ్‌లోనూ తడబడింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను తేలిగ్గా తీసుకున్న లంక బ్యాటర్లు అవసరం లేకపోయినా భారీ షాట్లకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. శానక, రాజపక్స (20; 21 బంతుల్లో 2x4),ధనంజయ (12; 11 బంతుల్లో 1x4) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. డేవిడ్ వీజ్ (2/16), షోల్జ్ (2/18), స్మిట్ (1/16), ఫ్రైలింక్ (2/26) లంకకు కళ్లెం వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.