Begin typing your search above and press return to search.

తిమింగలం 'వాంతి' తో కోటీశ్వరాలైన మహిళ .. ఆ వాంతి ఖరీదెంతో తెలుసా ?

By:  Tupaki Desk   |   4 March 2021 2:30 AM GMT
తిమింగలం వాంతి తో కోటీశ్వరాలైన మహిళ .. ఆ వాంతి ఖరీదెంతో తెలుసా ?
X
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుందో తెలీదు. ఫిబ్రవరి 23వ తేదీన నఖోన్‌ సి తమ్మరత్‌ ప్రావిన్స్ ‌లో ఉన్న తన బీచ్‌ హౌస్‌ వద్ద సిరిపొర్న్‌ నియామ్‌రిన్‌ అనే మహిళ వాకింగ్‌ చేస్తుండగా భారీ వ్యర్థ పదార్థం ఒడ్డుకు కొట్టుకువచ్చి కనిపించింది. అయితే దాన్ని పరిశీలించిన ఆమె ముందుగా దాన్ని చేపల వ్యర్థాలేమోనని అనుకుంది. ఆ పదార్థం చేపల వాసన వచ్చింది. దాంతో ఆమె అలా అనుకుంది. అయితే , ఆమె అయిష్టంగానే దాన్ని తన ఇంటికి తెచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తన ఇరుగు పొరుగు వారితో మాట్లాడగా అది చేపల వ్యర్థం కాదని, తిమింగలం వాంతి అని, దాన్ని అంబర్గ్రిస్ అని పిలుస్తారని, ఆ పదార్థాన్ని పెర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారని, దాని విలువ పెద్ద మొత్తంలో ఉంటుందని వెల్లడైంది.

ఇక అది తిమింగలం వాంతి అవునా, కాదా అని తేల్చుకునేందుకు ఇరుగు పొరుగు వారు ఓ పరీక్ష కూడా చేశారు. దాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని మంట మండించారు. దీంతో అది మండింది. చివరకు దాన్ని తిమింగలం వాంతి అని నిర్దారించారు. దాని విలువ 2.50లక్షల డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.1.90కోట్లు. అయితే దాన్ని విక్రయించడం కోసం ఆమె నిపుణులను సంప్రదించగా.. దాన్ని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని కాలనీలో పనులు చేపట్టేందుకు ఉపయోగిస్తానని తెలిపింది. సాధారణంగా తిమింగలాలు వాంతి చేసుకున్నప్పుడు ఆ పదార్థం మొత్తం సముద్రాల ఒడ్డుకు కొట్టుకువస్తుంది.

అసలు దానికి అంత డిమాండ్ ఎందుకు అంటే .. 'అంబర్గ్రిస్' అనేది స్మెర్మ్ వేల్స్ నుంచి పుడుతుంది. పొడవైన ముక్కుతో ఉండే ఈ తిమింగిలాలు స్పెర్మ్ ఆయిల్‌ ను విడుదల చేస్తాయి. దాన్నే అంబర్గ్రిస్ అని అంటారు. తిమింగలం దాన్ని నీటిలోకి వాంతి చేస్తుంది. అదే సముద్ర తీరానికి కొట్టుకొస్తుంది. దీన్నే నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు. అంబర్గ్రిస్ ను ఎక్కువగా ఖరీదైన పెర్‌ ఫ్యూమ్‌ లలో ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు వాసన కోల్పోకుండా ఉంటుంది.