Begin typing your search above and press return to search.
తారక్ భేటీతో కేసీఆర్ చేతికి అస్త్రాన్ని ఇచ్చిన అమిత్ షా?
By: Tupaki Desk | 22 Aug 2022 5:02 AM GMTతెలివి ఏ ఒక్కరి సొంతం కాదు. తాము మాత్రమే తెలివైన వాళ్లమని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. తాజాగా అలాంటి పరిస్థితే బీజేపీ అగ్రనేత అమిత్ షాకు ఎదురైందా? అంటే అవునంటున్నారు రాజకీయ వర్గాలు. మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అమిత్ షా.. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తనను కలిసేందుకు ప్రముఖ సినీ నటుడు తారక్ తన వద్దకు వచ్చేలా ప్లానింగ్ చేయటం తెలిసిందే. ఈ ఇద్దరు కలవటం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి తోడు.. ఎన్టీఆర్ తో కలిసి డిన్నర్ చేయటం.. దాదాపు వీరి భేటీ 45 నిమిషాలకు పైనే సాగటం తెలిసిందే.
తాజా పరిణామం బీజేపీకి లాభిస్తుందన్న మాట బీజేపీ నేతల నోటి నుంచి వస్తుంటే.. అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు టీఆర్ఎస్ వర్గాలు. తెలిసి చేశారో.. తెలియక చేశారో కానీ ఎన్టీఆర్ ను కలవటం ద్వారా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతికి తిరుగులేని అస్త్రాన్ని ఇచ్చినట్లుగా వారు చెబుతున్నారు. ఎన్టీఆర్ ను ఎంతలా ప్రొజెక్టు చేసినా.. ఆయన్ను సీమాంధ్రకు చెందిన ప్రముఖుడిగానే పరిగణలోకి తీసుకుంటారే తప్పించి.. తెలంగాణ ప్రజలు ఆయన్ను తమ వాడిగా అనుకునే అవకాశమే లేదని చెప్పాలి.
నిజానికి అమిత్ షాను తారక్ కలుస్తారన్న వార్త బయటకు వచ్చినంతనే.. అందరూ ఏపీ రాజకీయాలకు సంబంధించిన కూడికలు.. తీసివేతలు వేసుకున్నారే తప్పించి.. తెలంగాణ రాజకీయాలకు రిలేట్ చేసుకోకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.
మునుగోడు ఉప పోరు నేపథ్యంలో ఎన్టీఆర్ ను కలవటం ద్వారా బీజేపీకి కలిగే లాభం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న వేళ.. ఇప్పుడే ఇంత హడావుడిగా కలవటం ద్వారా గులాబీ బాస్ చేతికి అస్త్రాన్ని అందించినట్లు అవుతుందని చెబుతున్నారు. టైమ్లీగా తెలంగాణ.. సీమాంధ్ర సెంటిమెంట్ ను ఎలా రగిలించాలో కేసీఆర్ కు తెలియంది కాదు.
అలాంటప్పుడు సీమాంధ్ర మూలాలు ఉన్న ఎన్టీఆర్ తనను కలిసేలా అమిత్ షా వేసిన ప్లాన్ బూమ్ రాంగ్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే విషయంలో గులాబీ బాస్ కు మించినోళ్లు ఎవరూ ఉండరన్న విషయం తెలిసిందే.
సీమాంధ్ర మూలాలతో పాటు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన వేళ.. ఎవరైనా అత్యుత్సాహంతో దీనిపై స్పందిస్తే.. వెంటనే తెలంగాణ ప్రజలకు కాలేలా ఇష్యూను డైవర్టు చేసే సత్తా కేసీఆర్ కు ఉందన్న విషయం తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనను కలిసేలా చేసుకోవటం ద్వారా.. గులాబీ బాస్ చేతికి అస్త్రంచిక్కినట్లేనని చెప్పక తప్పదు.