Begin typing your search above and press return to search.

ఏపీలో మాజీ మంత్రులు కనపడటం లేదా?

By:  Tupaki Desk   |   14 July 2020 1:00 PM GMT
ఏపీలో మాజీ మంత్రులు కనపడటం లేదా?
X
దూకుడైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పాలనతో ప్రజలకు చేరువ అవుతున్నారు సీఎం జగన్. అలాగే తనను అణచాలని చూస్తున్న ప్రత్యర్థులతోనూ చెడుగుడు ఆడేస్తున్నారు. ఈ క్రమంలోనే లేనిపోని పంచాయితీలు ఎందుకని టీడీపీ మాజీ మంత్రులంతా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతున్నారు. జగన్ ధాటికి తాము యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండమంటూ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తున్నారట..

టీడీపీ ప్రభుత్వంలో ఒక ఊపు ఊపిన మాజీ మంత్రులు ఇప్పుడు లోకేష్ కు.. చంద్రబాబుకి అందుబాటులో లేరంట.. ఎందుకు అంటే ఎక్కువ మీడియాలో కనిపిస్తే మా గతి కూడా అచ్చెన్నాయుడు మాదిరి అవుతుందని తెగ భయపడి సైలెంట్ అయిపోతున్నారట.. ఈ మేరకు ఒక లెటర్ ను చంద్రబాబుకు ఇచ్చేస్తున్నారట.. అందులో లోకేష్ పెత్తనం మీద పెద్దగా వాళ్లకు ఆసక్తి లేదు అని పేర్కొంటున్నారట... ఎన్నికలకు ముందు అప్పటి ఊపును బట్టి యాక్టివ్ అవుతామని అధినేతకు హామీ ఇస్తున్నారట..తమకు ఏమీ కాంపిటీషన్ లేదు కదా ఎప్పుడైనా యాక్టివ్ కావచ్చని వారంతా బాబుకు విన్నవించుకుంటున్నారట..

టీడీపీలో ఫైర్ బ్రాండ్స్ లాంటి పరిటాల కుటుంబం పూర్తిగా రాజకీయాల్లో మౌనం దాల్చింది. ఇక కడప జిల్లాలో టీడీపీ మాజీ మంత్రులు పార్టీలు మారారు. చిత్తూరు జిల్లాలో అమర్ నాథ్ రెడ్డి.. నెల్లూరులో నారాయణ ఉనికిలో లేకుండా పోయారు.. ప్రకాశం జిల్లాలో సిద్ధా రాఘవరావు వైసీపీలోకి మారారు.

గుంటూరులో ఏదో ఒకరో ఇద్దరో యాక్టివ్ గా ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. కృష్ణలో దేవినేని యాక్టివ్ గా ఉన్నా.. మిగతా వారు అతడికి సహకరించడం లేదు. గోదావరి జిల్లాలో పెద్దగా యాక్టివ్ గా లేరు. వైజాగ్ లో గంటా ఇంకా గంట కొట్టడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అసలు పార్టీ ఉందా అని అంటున్నారు. ఇలా టీడీపీ మాజీ మంత్రులు చంద్రబాబుకు.. లోకేష్ కు ముఖం చాటేస్తున్నారని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.