Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురు ఎంపీల మెడపై కత్తి
By: Tupaki Desk | 6 Jun 2018 5:22 PM GMTఅయిదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదానికి అంతా సిద్దం కావడంతో ఇప్పడు ఆ పార్టీ నుంచి గెలిచిన మరో ముగ్గు ఎంపీల పరిస్థితేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ నుంచి గెలిచినవారిలో ముగ్గురు ఇంతకుముందే పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వారిలో ఇద్దరు ఎస్పీవై రెడ్డి - బుట్టా రేణుకలు టీడీపీలో చేరగా... కొత్తపల్లి గీత తొలుత టీడీపీలోకి వెళ్లిన ఆ తరువాత ఆ పార్టీకీ దూరమయ్యారు. అయితే.. వైసీపీ గుర్తుతో గెలిచిన వీరిని లోక్ సభలో ఇంకా టెక్నికల్ గా వైసీపీ ఎంపీలుగానే గుర్తింపు ఉంది.
కానీ.. ఇప్పుడు పార్టీ నిర్ణయం ప్రకారం అయిదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందుతుండడంతో మిగతా ముగ్గురు కూడా పార్టీ నిర్ణయం ప్రకారం రాజీనామాలు చేయాలి. కానీ.. ప్రస్తుతం పార్టీలో లేని ఆ ముగ్గురు రాజీనామాలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే వారి సభ్యత్వాలు రద్దు చేయాలని వైసీపీ లోక్ సభ స్పీకరుకు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వారి సభ్యత్వాలు రద్దయ్యే అవకాశముంటుంది.
అప్పుడు వారిని చేర్చుకున్నతెలుగుదేశం పార్టీకి నైతికంగా అది తీరని దెబ్బ. అంతేకాదు.. ఎంపీలకు మాదిరిగానే ఎమ్మెల్యేలనూ తమ పార్టీలోకి తీసుకుని పదవులివ్వడంతో వారి విషయంలోనూ మరోసారి చంద్రబాబు విమర్శలకు గురికాక తప్పని పరిస్థితి. అంతేకాదు.. వారి విషయంలో ఏమాత్రం పట్టించుకోని ఏపీ స్పీకర్ కోడెల కూడా ఆ పాపం పంచుకోవాల్సి ఉంటుంది.