Begin typing your search above and press return to search.
కేసీఆర్.. 'ప్రమోషన్' కల నెరవేరేనా..?
By: Tupaki Desk | 17 Feb 2022 3:31 AM GMTరాజకీయాల్లో పదవులపై ఆశలకు హద్దులు ఉండవు. ముందు పంచాయితీ మెంబర్ అయితే.. చాలను కున్న నాయకులు..తర్వాత.. చైర్మన్ కోసం పోటీ పడతారు. ఇలానే.. అనేక మంది నాయకులు.. తమకు ఉన్న పదవులకు ప్రమోషన్ కోరుకుంటారు. ఇది తప్పు కూడా కాదు.
అయితే.. సాధ్యాసాధ్యాల మాటే చర్చకు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలోనూ.. ఇదే తరహా చర్చ సాగుతోం ది. ఆయన వరుస పెట్టి రెండు సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. తొలిసారి ముఖ్య మంత్రి అయిన తర్వాత.. ఆయన కన్ను జాతీయ రాజకీయాలపై పడింది.
నేషనల్ ఫ్రంట్ పేరుతో కొంత హడావుడి కూడా చేశారు. ప్రత్యేక హెలికాప్టర్ తెచ్చుకుని రాష్ట్రాలు చుట్టే శారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి.. కేంద్రంపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఇక, రెండోసారి సీఎం అయిన తర్వాత.. కూడా ప్రయత్నాలు చేశారు. ఇక, ఇటీవల కేంద్రానికి తనకు మధ్య గ్యాప్ పెరగడం.. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. నిధులు ఇవ్వకపోవడం.. విభజన హామీలను పట్టించుకోకపోవడంతో.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై కేసీఆర్ కత్తి కట్టారు.
మోడీని గద్దె దింపే వరకు నిద్రపోనని నిత్యం శపథాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిసా ముఖ్యమంత్రులు సహా.. కర్ణాటకలోని.. మాజీ ప్రధాని దేవెగౌడ మద్దతును ఆయన ఆశించారు. వారు కూడా కేంద్రంతో విసిగిపోవడమో.. లేక కేంద్రంలో ఉన్న రాజకీయ గ్యాప్‌నుతమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇదే సరైన సమయం అని బావిస్తుండడంతో తెలియదు కానీ.. ఓకే చెప్పారు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దూకుడుగా ఉన్నారు. రేపు ఇతర రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు కూడా ఒకటైతే.. ఈ ప్రత్యామ్మాన కూటమి.. అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తున్నాయి.
ఇదిలావుంటే.. కేసీఆర్ పెట్టుకున్న ఆశలు.. ఏమేరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తిగా మారింది. ఎందుకం టే.. ఆయన మనసంతా.. ప్రధాని పీఠంపై ఉంది. పైగా తెలుగు వారికి ఇబ్బందిగా మారిన హిందీ.. కేసీఆర్ సొంతం. సో.. ఆయన ఉత్తరాది రాష్ట్రాలను కూడా మెప్పించే అవకాశం ఉంది. కానీ, ఎటొచ్చీ.. రాష్ట్రంలో ఉన్నది 17 పార్లమెంటు స్థానాలు మాత్రమే. వీటిలో అన్నింటినీ.. కేసీఆర్ హస్తగతం చేసుకున్నా.. బెంగాల్‌లో 41, తమిళనాడు.. 39 స్థానాలు ఉండడంతో అక్కడ పార్టీలు.. ఆధిక్యత పొందితే.. అప్పుడు కేసీఆర్ కల సాకారం కావడం కష్టమే.
ఎందుకంటే.. బెంగాల్ సీఎం కు కూడా ప్రధాని కావాలని.. ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ ఆశ లేకపోయినా.. ఆయనకు బెంగాల్ సీఎంకు మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో.. ఆయన మద్దతు అప్పుడు బెంగాల్ సీఎంకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేసమయంలోఒడిసా సీఎం నవీన్ కూడా మమతే మొగ్గు చూపుతారు. ఇలా ఎలా చూసుకున్నా.. కేసీఆర్ కల సాకారం కావడం ఒకింత కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.