Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రిటైర్ మెంట్ తీసుకోకపోతే ఇక కాంగ్రెస్ 'వీఆర్ఎస్' తీసుకోవాలి?
By: Tupaki Desk | 4 July 2022 8:08 AM GMTకాంగ్రెస్ ను ఎవరో వచ్చి ముంచాల్సిన పనిలేదు. అందులోని సీనియర్ నేతలే కాంగ్రెస్ ను అథ: పాతాళానికి తొక్కేస్తారన్న విమర్శ వినిపిస్తుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ల 'హస్త'మే ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారిన ఘటనలున్నాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్యసింధియా, రాజస్థాన్ లో సచిన్ పైలెట్ లాంటి వారు కాంగ్రెస్ ను వీడి పక్క చూపులు చూడడానికి కారణం అక్కడి సీనియర్లు. ఇక తెలంగాణ కాంగ్రెస్ యువ నేత రేవంత్ రెడ్డి గద్దెనెక్కగానే జీర్ణించుకోలేక కాంగ్రెస్ తెలంగాణ సీనియర్లు చేయని ఫిర్యాదు లేవు. విమర్శించని నాలుక లేదు. అందుకే యువతను ఎదగనీయకపోవడమే కాంగ్రెస్ లో గొప్ప వైఫల్యంగా చెప్పవచ్చు. ఎవరైనా రేవంత్ లాంటి వారు వచ్చినా అతడిని తొక్కేయడానికి కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒక్కటై చేసే రచ్చనే ఆ పార్టీకి మైనస్ గా మారుతోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అయితే ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే తెలంగాణలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరమవడానికి కారణమనే వాదనలున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా నేతల వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమనే ప్రచారం జరుగుతోంది. 'కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు.. కాంగ్రెస్ వాదులు తప్ప' అన్న నానుడిని తెలంగాణ నేతలు అక్షరాల నిజం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ రెండుసార్లు వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. సమైక్యాంధ్రులను కాదని నాటి యూపీఏ సర్కారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏపీలో పార్టీని ఫణంగా పెట్టి మరీ తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊహించని ఫలితం వచ్చింది. అటు ఏపీ కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతుకాగా.. ఇటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది.
నాటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. కాంగ్రెస్ లోని వర్గపోరు కారణంగా ముఖ్య నేతలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చేజేతులా టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టింది. కాంగ్రెస్ నేతల అనైక్యతకు తోడు ఆపార్టీ బద్ధశత్రువైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇక ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేతలు సైతం ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు.
వాట్సాప్ యూనివర్సిటీలు, సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మంచిగా భాష పటిమతో బీజేపీ దూసుకొని పోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా పాత తరం వాళ్లనే కొనసాగిస్తోంది. వాళ్లకు కనీసం సరిగా 'ఈమెయిల్' కూడా చెక్ చేసుకోవడం రావడం లేదు. అలాంటి వాళ్లకు ఇంకా రిటైర్ మెంట్ తీసుకోకపోతే కాంగ్రెస్ 'వీఆర్ఎస్' తీసుకోవాలని అంటున్నారు.
మోడీ దేశానికి 80 లక్షల కోట్లు అప్పు తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నా.. బీజేపీకి ఉన్న టెక్నాలజీ వల్ల అవి మార్కెట్ లోకి వెళ్లకుండా బీజేపీ యూత్ క్యాడర్ సమర్థంగా అడ్డుకుంటోంది. కాంగ్రెస్, ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా బీజేపీ చేస్తోంది మంచి అని ఉదరకొడుతోంది. బీజేపీ యూత్ క్యాడర్ వాట్సాప్ యూనివర్సిటీలో వీర లెవల్ లో బీజేపీ భజన చేస్తూ మిగతా పార్టీల వాళ్లకు చమటలు పట్టించే విధంగా పని చేస్తున్నారు. అందులో యూత్ లో క్రేజ్ ఉన్న వాళ్లను బీజేపీ లాగేస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వృద్ధ జంబూకాలను కొనసాగిస్తే మాత్రం కాంగ్రెస్ ఇక వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.
కాంగ్రెస్ కి ఈసారి కనీసం 100 సీట్లు పైన ఎంపీలు గెలుచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం కష్టపడితే కనీసం 130-140 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ని సీట్లు గెలిస్తే ఖచ్చితంగా యూపీఏ అధికారంలోకి వస్తుంది. మిగతా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎలాగైనా ఈసారి కమలం పార్టీని అధికారంలోకి రానీయకూడదని బలంగా కోరుకుంటున్నాయి. ఈ కోపంతోనే కాంగ్రెస్ కు కనీసం 130 పైన వస్తే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి అధికారంలో కూర్చబెట్టడానికి రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ఇదే మాట చెబుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ సీనియర్లను పక్కనపెట్టడమే న్యాయం అని అంటున్నారు..
కాంగ్రెస్ కు సీనియర్లే శాపమని రాహుల్ గాంధీ ఇప్పటికే బయటపడ్డారు.. వారు పార్టీని వీడితే కానీ పగ్గాలు చేపట్టనని మొండికేస్తున్నాడు. కానీ సోనియా మాత్రం వృద్ధ జంబూకాలపై ఆశలు వదలు కోవడం లేదట.. దీంతో రాహుల్ గాంధీ తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకోనని మొండికేస్తున్నాడట.. ఈ ఫుల్ ఎపిసోడ్ లో రాహుల్ పదవి తీసుకోవడానికి ప్రధాన అడ్డంకిగా సీనియర్లే ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడీ కథ ఢిల్లీలో చర్చనీయాంశమవుతోంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అధ్యక్ష పదవి బరువైందని.. ఆమెకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి కనీసం నేతలకు అపాయింట్ మెంట్స్ ఇచ్చే పరిస్థితి లేదు అని ఢిల్లీ వర్గాల్లో టాక్ ఉంది. అందుకే రాహుల్ గాంధీని ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తీసుకోవాలని అందరూ కోరుతున్నారంట.. అయితే పార్టీ పూర్తిగా ప్రక్షాళన అయితేనే కానీ తాను అధ్యక్ష పదవి చేపట్టనని రాహుల్ గాంధీ మొండికేస్తున్నాడట.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే సీనియర్లకు మంగళం పాడాలని.. మళ్లీ ఓడిపోతే ఇక కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు అని.. ముందుగా బీజేపీ కోవర్ట్ లను కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తీసేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నాడట.. బీజేపీ కోవర్టులకు గులాం నబీ అజాద్ సారథ్యం వహిస్తున్నారని.. వాళ్ల అందరినీ తప్పిస్తే కానీ తాను పదవి తీసుకోని అని రాహుల్ గాంధీ అధినేత్రి సోనియా ముందు కుండబద్దలు కొట్టాడంట..
పార్టీలోని యువ నాయకత్వంకు సపోర్టు చేస్తూ వారికి పదవులు ఇస్తే తప్ప తాను పదవిని తీసుకోనని రాహుల్ గాంధీ చెప్తున్నారంట.. ఇంకా వృద్ధ జంబూకాలను పట్టుకొని నేను పార్టీని ఈదలేను అని.. యువకులకు పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తే కానీ పార్టీ బతికదు అని రాహుల్ తెగేసి చెప్తున్నాడట..
ఇప్పుడంతా 30-40శాతం సోషల్ మీడియా మీద నడుస్తోందని.. అలాంటప్పుడు వృద్ధ జంబూకాలు కొత్త ఓటర్లకు ఎవరు తెలియదని అని కూడా చెప్పారంట.. కాంగ్రెస్ లో కూడా రాహుల్ చెప్పింది నిజమని.. యువ నేతలను తీసుకొని పార్టీకి జవసత్వాలను నింపాల్సిన అవసరం ఉందని పెద్దఎత్తున ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ ఈ జంబూకాలు మాత్రం పార్టీని వదలకుండా దెబ్బ తీస్తూనే ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.