Begin typing your search above and press return to search.
అఖిల ప్రియ.. వాట్ టు డూ?
By: Tupaki Desk | 8 Jan 2019 12:46 PM GMTఇప్పటికిప్పుడు సిట్టింగులను కాదని వేరే వ్యక్తికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు టీడీపీలో. పొరపాటును సిట్టింగ్ ను కాదనుకుంటే10 మంది దానికి పోటీగా వస్తున్నారు. పైగా సిట్టింగ్ కు టిక్కెట్ నిరాకరిస్తే, అది అంతర్గత వ్యతిరేకతకు దారితీస్తుంది. ఇన్నిలెక్కలున్నప్పటికీ అఖిల ప్రియ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న అఖిల్ ప్రియకు ఏకంగా సీట్ ఇవ్వకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
అఖిల ప్రియ స్థానంలో భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డికి ఆళ్లగడ్డ టిక్కెట్ కేటాయించే అవకాశాలున్నాయంటూప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యనటకు స్వయంగా మంత్రి స్థానంలో ఉన్న అఖిలప్రియ డుమ్మా కొట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీకి, అఖిలకు మధ్య ఉన్న గ్యాప్ ను ఈ ఘటన కళ్లకు కట్టినట్టుచూపిస్తోంది.
తల్లి హఠాన్మరణంలో ఎమ్మెల్యే అయి, ఆ తర్వాత మంత్రిగా మారిన అఖిల ప్రియను మొదట్నుంచి సుబ్బారెడ్డి వర్గంవ్యతిరేకిస్తూనే ఉంది. దీనికి తోడు బాబు చేపట్టిన అంతర్గత సర్వేల్లో అఖిలకు అంతంతమాత్రంగానే రేటింగ్స్ వచ్చాయి. దీంతో ఆమెను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజకీయాల్లో అనుభవం అంతంతమాత్రమే అయినప్పటికీ అఖిల ప్రియ ఏమాత్రం చలించడం లేదు. ఆమె ఇప్పటికేతెరవెనక పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె తన వర్గంతో కలిసి జనసేన పార్టీలో చేరేఅవకాశాలున్నాయి. అది కూడా అదను చూసి, టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా మంచి టైమ్ లో జంప్ కొట్టాలని అఖిల ప్రియభావిస్తున్నారట.
గతంలో ప్రజారాజ్యం పార్టీకి అఖిల ప్రియ తల్లిదండ్రులకు మంచి సంబంధాలుండేవి. ఆ అనుబంధంతో అఖిల ప్రియ వస్తేపవన్ ఎర్రతివాచీ వేసి స్వాగతించడం ఖాయం. మరీముఖ్యంగా జనసేనలో మహిళా ప్రాతినిథ్యం లేదనే విమర్శలకు అఖిలప్రియతో చెక్ పెట్టినట్టవుతుంది.