Begin typing your search above and press return to search.
స్మృతి ప్రమాణం..లోక్ సభ హోరెత్తిపోయింది
By: Tupaki Desk | 17 Jun 2019 1:28 PM GMTస్మృతి ఇరానీ... బీజేపీలో ఓ కీలక నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన నేత. తొలిసారే ఓడినా కూడా మోదీ కేబినెట్ లో బెర్తు దక్కించుకున్న నేత. అంతేనా... మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో విమర్శలు వెల్లువెత్తినా... కేబినెట్ నుంచి బయటకు రాని నేత. మరి ఈ మాత్రానికే లోక్ సభలో ఎంపీగా స్మృతి ఇరానీ ప్రమాణం చేస్తే సభ మొత్తం చప్పట్లతో మారుమోగిందా? బీజేపీ సభ్యులు మొత్తం బల్లలు చరిచి ఆమె ప్రమాణాన్ని వేడుక చేసుకున్నారా? చివరకు ప్రధాని స్థానంలో ఉన్న మోదీ కూడా బల్ల చరిచి మరీ ఆమె ప్రమాణానికి జేజేలు పలికారా?
ఈ మాత్రానికి అయితే కాదండోయ్. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఓడించినందుకు స్మృతి ఇరానీకి ఈ మేర ఘన స్వాగతం లభించింది. రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేధీ చాలా కాలం నుంచి గాంధీ ఫ్యామిలీ చేతిలోనే ఉంది. ఇప్పటిదాకా మూడు పర్యాయాలు అమేథీ నుంచే రాహుల్ గెలిచారు. 2014 ఎన్నికకల్లో రాహుల్ ను ఢీకొట్టేందుకు సై అన్న స్మృతి కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టించారు. అయితే ఆ పర్యాయం ఓడినా... రెండో యత్నంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు, కీలక బాధ్యతల్లోకి దిగిన రాహుల్ ను ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించి తన సత్తా ఏమిటో చూపించారు.
పురుష అభ్యర్థులపై మహిళా అభ్యర్థులు గెలవడమంటేనే కాస్తంత ప్రత్యేకంగా చెప్పుకునే మనం.... ఏకంగా దేశాన్ని అత్యదిక కాలం పాలించిన పార్టీకి అధినేతగా ఉన్న రాహుల్ ను ఓ మహిళగా స్మృతి ఓడించడమంటే మాటలు కాదు కదా. అందుకే... పార్లమెంటులో కొత్త సభ్యుల ప్రమాణం సందర్బంగా స్మృతి వంతు వచ్చేసరికి సభ మొత్తం బీజేపీ సభ్యుల చప్పట్లు, కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. స్మృతి ప్రమాణం మొదలుపెట్టిన తర్వాత కూడా చప్పట్లు కొనసాగడం గమనార్హం. మొత్తంగా రాహుల్ ను మట్టి కరిపించిన స్మృతికి బీజేపీ సభ్యులు ఘనంగానే స్వాగతం చెప్పారన్న మాట.