Begin typing your search above and press return to search.

ఒక మ‌నిషి ఎంత తింటాడు? ఏపీ అధికారులు ఏం చెప్పారంటే

By:  Tupaki Desk   |   2 Nov 2022 10:30 AM GMT
ఒక మ‌నిషి ఎంత తింటాడు?  ఏపీ అధికారులు ఏం చెప్పారంటే
X
ఇదేదో.. ఏపీ ప్ర‌జ‌ల ఆహార వ్య‌వ‌హారాల గురించిన చ‌ర్చ‌కాదు. అస‌లు ఆ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించ‌లేదు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ముఖ్యంగా గ‌త వారం రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో త‌న పార్టీ నేత‌ల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు కూడా సీఎం జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతున్నాయ‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. విష‌యం ఏంటంటే.. కొన్నాళ్లుగా ఏపీలో ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య స‌ర్కారు అనుసంధానం పెంచుతోంది. ప్ర‌భుత్వ సేవ‌ల‌కు నిర్దేశిత సొమ్ము త‌ప్ప రూపాయి అద‌నంగా చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా చెబుతోంది.

అయినా కూడా చాలా జిల్లాల నుంచి వ‌స్తున్న స్పంద‌న ఫిర్యాదుల్లో అవినీతిపై ఎక్కువ‌గా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. రైతుల‌కు ఇచ్చే పాస్ బుక్కుల నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే ఫ్యామిలీ స‌ర్టిఫికెట్లు, డెత్ స‌ర్టిఫికెట్లు వంటివాటిలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోంద‌ని, ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు గుంజుతున్నార‌ని స్పంద‌న‌లో ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఇక‌, రాష్ట్రంలో గ‌త వారంలో రెండు ఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వానికి మ‌రింత బ్యాడ్ నేమ్ తెచ్చేలా చోటు చేసుకున్నాయి. ప్ర‌ముఖ ప్ర‌భుత్వ వైద్య శాల‌ల్లో పోస్టు మార్ట‌మ్ త‌ర్వాత బ‌డీల‌ను అప్ప‌గించేందుకు లంచాలు తీసుకున్నారు.

ఇవి కూడా ఆధారాల‌తో స‌హా కొంద‌రు స్పంద‌న‌లో ఫిర్యాదు చేశారు. ఆయా విష‌యాల‌ను తాజాగా సీఎం జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఈ సందర్బంగా జ‌గ‌న్ సంబంధిత అదికారుల‌ను నిల‌దీసిన‌ట్టు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న 'ఒక మ‌నిషి ఎంత తింటాడు?'' అని న‌ర్మ‌గ‌ర్భంగా లంచాల‌పై ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. అయితే, దీనిపై అధికారులు మాత్రం ఆ అవ‌స‌రంలేద‌ని, ఇప్పుడు పీఆర్సీ పెరిగిన త‌ర్వాత బాగానే జీతాలు ఇస్తున్నామ‌ని, ఎవ‌రూ లంచాల జోలికి పోకుండా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని చెప్పారట‌.

అయినా. కూడా జ‌గ‌న్ సంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనూహ్యంగా తానే స్వ‌యంగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌తాన‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని నేనే ప్రారంభిస్తాన‌ని చెప్పార‌ట‌. ఈ నేప‌థ్యంలో 'జ‌గ‌న‌న్న‌కు చెబుదాం' అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు త‌న పార్టీ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల ఫిర్యాదుల‌కు రేటు నిర్ణ‌యిస్తున్నార‌ని, ముఖ్యంగా కాంట్రాక్టర్ల నుంచి కూడా వ‌సూలు చేస్తున్నార‌ని ఫిర్యాదులు రావ‌డంతో జ‌గ‌న్ వారి విష‌యాన్ని క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి రాష్ట్రంలో మార్పు రావాల‌ని ఈ ఆరోప‌ణ‌లు స‌హించేది లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.