Begin typing your search above and press return to search.
తెలంగాణాలోనే మకాం : బీజేపీ టాప్ లీడర్స్ ఏం చేయబోతున్నారు..?
By: Tupaki Desk | 2 Jun 2022 12:30 AM GMTతెలంగాణా కాశ్మీర్ యాపిల్ లా ఊరిస్తోంది. నోటి దాకా వచ్చినట్లే ఉంది. ఈ చాన్స్ అసలు వదులుకోవద్దు అని కూడా అనిపిస్తోంది. సౌత్ లో కర్నాటక తరువాత తెలంగాణావే చోటిచ్చేకరెక్ట్ ప్లేస్ అని కూడా కమలానికి అర్ధమవుతోందిట. అందుకే ఏకంగా తెలంగాణా నడిగొడ్డున హైదరాబాద్ వేదికగా సందడి చేసేందుకు బీజేపీ తయారైపోయింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఈసారి వేదిక చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. దాన్ని అలా ఎంపిక చేసుకున్నారు కమలనాధులు. ఆ వేదిక హైదరాబాద్. హైదరాబాద్ కి బీజేపీ మొత్తం టాప్ లీడర్స్ అంతా తొందరలో రానున్నారు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయబోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, పార్టీ దిగ్గజ నాయకులు, ప్రెసిడెంట్ జేపీ నడ్డా నాయకత్వాన హైదరాబాద్ లో చేరి భారత దేశాన రేపటి ఎన్నికల్లో జరిగే రాజకీయ సమరానికి అక్కడే చాణక్య వ్యూహాన్ని రచిస్తారుట. అలాగే మరో ఏడాదిన్నరలో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారు ఆరు నూరు అయినా కూడా గెలిచి తీరాలన్న పట్టుదల అయితే బీజేపీ కేంద్ర పెద్దలలో కనిపిస్తోంది.
దానిలో భాగమే హైదరాబాద్ లో అంతా ల్యాండ్ అవుతున్నారు అని అంటున్నారు. బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోలేదు కాబట్టి తెలంగాణా కాంగ్రెస్ కి కూడా హుషార్ ఉండే అవకాశం లేదు. ఇక రెండు సార్లు కేసీయార్ కి అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ దఫా కచ్చితంగా మాజీని చేస్తారు అని కూడా అంచనాలు వేసుకుంటున్నారు.
వరసగా కొన్ని ఉప ఎన్నికలతో పాటు, హైదారాబాద్ లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీకి ఇపుడు తెలంగాణాలో మంచి ఊపు ఉందని భావిస్తున్నారు. ప్రెసిడెంట్ బండి సంజయ్ చేసిన పాదయాత్రకు కూడా జనాలు బాగా వచ్చారని, ఈ మధ్యనే జరిగిన అమిత్ షా సభ సూపర్ హిట్ అయిందని కూడా లెక్కలేసుకుంటున్నారు.
దాంతో తెలంగాణా మీద ఫుల్ ఫోకస్ పెడితే కచ్చితంగా గెలుపు పిలుపు వినిపిస్తుందని కూడా బీజేపీ మాస్టర్ ప్లాన్ తో ఉందని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీకి చెందిన అతిరధ మహారధులు అంతా హైదరాబాద్ వచ్చి మూడు రోజుల పాటు విడిది చేయబోతున్నారు అని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సమావేశాలు జరిగే అవకాశముంది. హైదరాబాద్ లోని నోవటెల్ హొటల్ లో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశంలో బీజేపీ దశ దిశను నిర్దేశించడంతో పాటు తెలంగాణాలో అధికారం కోసం పక్కా స్కెచ్ గీస్తాయని అంటున్నారు.
మొత్తానికి చూస్తే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా మూడు రోజులు హైదరాబాద్ లో ఉంటారు అంటేనే ఒక విధంగా టీయారెస్ తో సమరానికి సై అన్నట్లుగానే భావించాలి. మరి బీజేపీ వేస్తున్న ఈ ఎత్తులు ఎంతవరకూ పారుతాయి. టీయారెస్ దీని మీద వేసే పై ఎత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలి.