Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్​ తయారీకి వాడే రసాయనాలేంటీ?

By:  Tupaki Desk   |   10 Jan 2021 8:54 AM GMT
కరోనా వ్యాక్సిన్​ తయారీకి వాడే రసాయనాలేంటీ?
X
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్​ ప్రారంభమైంది. అమెరికా, బ్రిటన్​ లాంటి అగ్రదేశాల్లో అత్యవసర వ్యాక్సినేషన్​ మొదలైంది. ముందుగా ఫ్రంట్​ లైన్​ వారియర్స్​కు వాక్సిన్​ ఇస్తున్నారు. మన దేశంలోనూ కోవాగ్జిన్​, ఆస్ట్రాజెనికాకు అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్​లు తీసుకుంటే సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయన్న ఆందోళనలు కూడా ప్రజల్లో నెలకొన్నాయి.

మన దేశంలో వ్యాక్సిన్​ తీసుకోవడానికి దాదాపు 60 శాతం మంది సిద్ధంగా లేరని ఓ సర్వే సంస్థ తేల్చిచెప్పింది అయితే కరోనా వ్యాక్సిన్​ అంటే నిజంగానే అంతగా భయపడాలా? ఆ వ్యాక్సిన్​లో వాడే రసాయనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో ఫైజర్​, మోడెర్నా వ్యాక్సిన్​కు అనుమతులు వచ్చిన విషయం తెలిసింది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి వస్తున్న ఫీడ్​బ్యాక్​ ప్రకారం.. ఎక్కువగా సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా మోడార్నా, ఫైజర్​ వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని సమాచారం.

ఫైజర్ బయోంటెక్ వ్యాక్సిన్‌లో ఎటువంటి రసాయనాలు వాడతారంటే..

ఫైజర్​ ఎంఆర్​ఎన్​ఏకు చెందిన వ్యాక్సిన్. ఇది సార్స్​ కోవిడ్​ 2 వైరల్ స్పైక్ గ్లైకోప్రొటీన్ భాగాన్ని ఉత్పత్తి చేసేలే మన శరీరంలోని కణాలను ప్రేరేపిస్తుంది. కరోనా వచ్చినప్పుడు మనం అనారోగ్యానికి గురికాకుండా ఈ స్పైక్​ ప్రోటిన్​ కాపాడుతుంది.
అంతేకాక కరోనా వైరస్​శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధకశక్తిని ప్రేరేపిస్తుంది. కొవ్వు పదార్ధాలతో తయారు చేసిన ఈ టీకాలో జన్యు సంకేతమనే ఒక చిన్న లిపిడ్ నానోపార్టికల్‌లో స్టోర్ అయి ఉంటుంది. (4-హైడ్రాక్సీబ్యూటిల్) అజానెడిల్) బిస్ (హెక్సేన్-6,1-డైల్) బిస్ (2-హెక్సిల్డెకానోయేట్), - 2 - [(పాలిథిలిన్ గ్లైకాల్) -2000] -N, N-డైటెట్రాడెసిలాసెటమైడ్, – 1,2-డిస్టెరోయిల్-సాంగ్లిసెరో -3-ఫాస్ఫోకోలిన్, కొలెస్ట్రాల్ అనే రసాయనాలు ఈ వ్యాక్సిన్​లో ఇమిడి ఉంటాయి.
పొటాషియం క్లోరైడ్ , మోనోబాసిక్ పొటాషియం ఫాస్ఫేట్, సోడియం క్లోరైడ్ (టేబుల్ సాల్ట్), ప్రాథమిక సోడియం ఫాస్ఫేట్ డైహైడ్రేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఫాస్ఫేట్-బఫర్డ్ సెలైన్ (PBC)గా పిలిచే ఈ లవణాలు టీకా ఆమ్లత్వం మనిషి శరీరానికి దగ్గరగా ఉండేలా పనిచేస్తుంది.

మోడెర్నా వ్యాక్సిన్‌లో..

మోడెనా కూడా ఎం ఆర్​ఎన్​ఏ వ్యాక్సినే. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి ఒక చిన్న జన్యు సంకేతాన్ని ఉపయోగిస్తుంది. అందుకే రెండు వ్యాక్సిన్ల పదార్థాలు పోలికల్లో తేడాలు ఉంటాయి.
SM (స్పింగోమైలిన్) -102, పాలిథిలిన్ గ్లైకాల్ (PEG) 2000 డిమిరిస్టోయిల్ గ్లిసరాల్ (DMG),1,2-డిస్టెరోయిల్-ఎస్ఎన్-గ్లిసరో -3-ఫాస్ఫోకోలిన్ (DSPC), కొలెస్ట్రాల్, ట్రోమెథమైన్, ట్రోమెథమైన్ హైడ్రోక్లోరైడ్, ఎసిటిక్ ఆమ్లం, సోడియం అసిటేట్ సుక్రోజ్ (చక్కెర) ఇందులో ఉంటాయి. అయితే ఇవన్నీ కెమికల్​ సంకేతాలు. ఈ పదార్థాలతో ఈ రెండు వ్యాక్సిన్లను తయారు చేశారు. అయితే ఇటీవల ఈ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో ఒక శాతం మందికి అలర్జీలు వచ్చాయి. ఇది సాధారణమేనని వైద్యుల అంటున్నారు. ఏ వ్యాక్సిన్​ కైనా ఇటువంటి పరిస్థితి ఉంటుందని వాళ్లు చెబుతున్నారు.