Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:09 AM GMT
కరోనా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి?
X
చైనాను విపరీతంగా వణికిస్తున్న కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. ఈ వైరస్ ను నిలువరించటం ఇప్పటికైతే సాధ్యం కాని పరిస్థితి. ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు చైనా విపరీతంగా ప్రయత్నిస్తోంది. దీన్ని నిలువరించేందుకు వీలుగా కొత్త వ్యాక్సిన్ ను రూపొందించే పనిలో బిజీగా ఉంది. ఇంతకీ కరోనా వైరస్ సోకిన వారిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? కరోనా వైరస్ లక్షణాలు ఏ రీతిలో గుర్తించే వీలుందన్న విషయంలోకి వెళితే..

సాధారణంగా కరోనా వైరస్ బారిన పడిన వారికి ముక్కు కారటం.. దగ్గు.. గొంతునొప్పి.. తలనొప్పి.. జ్వరం.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. నలత గా ఉన్నట్లు అనిపించటం లాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. దీని తీవ్రత ఎక్కువైన కొద్దీ ఛాతీలో నొప్పి.. చలి.. జ్వరం.. గుండె కొట్టుకునే వేగం అంతకంతకూ పెరిగి పోవటం లాంటివి జరుగుతాయి.

నిమోనియా లక్షణాల తో పాటు.. మూత్ర పిండాలు ఫెయిల్ అయి.. మనిషి మరణానికి దగ్గరవుతారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ ను నిలువరించే కచ్ఛితమైన మందులేమీ లేవు. కరోనా వైరస్ లో మరో దుర్మార్గమైన డేంజర్ ఏమంటే.. ఇది ఒకరికొకరు కంటి చూపుతో కూడా వ్యాపించే వీలుంది. అంతేకాదు.. మనిషి.. మనిషి నుంచి కానీ.. జంతువు నుంచి మనిషిలోకి వ్యాపించే వీలుంది. అంటే.. కరోనా వైరస్ ఒకసారికి ఒకరికి సోకిందంటే.. చాలా వేగంగా మరొకరికి సోకే ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పక తప్పదు.